Karimnagar news” సిట్ ఏర్పాటు నిర్ణయంపై ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి హర్షం..

Karimnagar news”  శంకరపట్నం డిసీ ప్రతినిధి
యువకుల ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపేందుకు సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగితా రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎంతోమంది యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని డాక్టర్ కవ్వంపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లయిన్ బెట్టింగ్ లతో మరణిస్తున్న సంఘటనలు రోజురోజుకు వెలుగు చూస్తున్నాయ‌ని ఆయన పేర్కొన్నారు. ఆన్లయిన్ బెట్టింగ్ లు, గేమింగ్‌, రమ్మీ కేసులపై చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటన చేయడం సంతోషకరమని కవ్వంపల్లి పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ బెట్టింగ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సరదాగా మొదలైన ఈ బెట్టింగులు వ్యసనంగా మారి ప్రాణాలను బలిగొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఉచ్చులోంచి బయట పడలేక, అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. యువత, విద్యార్థులు పనులు మానేసి గంటల తరబడి ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నారని, ఒక్కోసారి సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్న సంఘటనలు కూడా లేకపోలేదని, వీటి నిరోధానికి పోలీసు నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.బెట్టింగ్ నేరస్తులపైననే కాకుండా ఆన్లయిన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వ్యక్తం చేశారు.

////////////////////////////////////////////////////////////////////////////

మధ్య దళారుల ను అరికట్టందుకే సహకార సంఘాలు…
సహకార సంఘాల అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్ కుమార్…
శంకరపట్నం డిసి ప్రతినిధి
రైతులను మధ్య దళారులు మోసం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకుని, సహకార సంఘాల ద్వారా మధ్య దళారుల ను మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందని, సహకార సంఘాల అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని సంఘం అధ్యక్షులు కేతిరి మధుకర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకార సంఘాల రిజిస్టర్ అశోక్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. రైతులకు అండగా ఉండేందుకు సహకార సంఘాల్లో కార్పొరేట్ బ్యాంకుల మాదిరిగా అన్ని సేవలను అందిస్తూ రైతులకు, అండగా ఉండేందుకు రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వాలు సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర, బోనస్ అందజేయడం జరుగుతుందన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగా మధ్య దళారీ వ్యవస్థ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సహకార సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తున్నార‌ని వివ‌రించారు. రైతులకు రుణాలతో పాటు, దీర్ఘకాలిక రుణాలను కూడా, బంగారం పైన, రుణాలు ఇస్తున్న‌ట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నరహరి వెంకటరమణారెడ్డి, పాలకవర్గ సభ్యులు కలకుంట్ల సత్యనారాయణ రావు, శిమిరాల శేషాచార్యులు, పద్మ, జూల శ్రీనివాస్, వెంగళ ప్రవీణ్, స్వరూప, సమ్మయ్య, సీఈఓ పోలు వీరస్వామి, అసిస్టెంట్ సీఈవో కొరిమి వేణు, సిబ్బంది, సతీష్ ,సాయికుమార్, మహేందర్ రైతులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////

ఈనెల 29న కేశవపట్నం అంగడి వేలం…
ఆసక్తి గలవారు 10 వేలు ధారావత్ చెల్లించి వేలంలో పాల్గొనాలి..
ఎంపీడీవో కృష్ణ ప్రసాద్…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
వారం సంత వేలంపాట ఈ నెల 29న గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని శంకరపట్నం ఎంపీడీవో, గ్రామ ప్రత్యేక అధికారి గోల్కొండ కృష్ణ ప్రసాద్ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం లో నిర్వహించే వారం సంత ప్రభుత్వ, జిల్లా అధికారుల ఆదేశం మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈనెల 29న వేలంపాట నిర్వహించడం జరుగుతుందని వివ‌రించారు. ఆసక్తి గలవారు పదివేల రూపాయలు దారావత్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చునని తెలిపారు. వేలం పాట అనంతరం వేలం పాట దక్కించుకున్న వ్యక్తులు సగం డబ్బులను అదే రోజు చెల్లించవలసి ఉంటుందని సూచించారు. పూర్తి వివరాల కోసం కేశవపట్నం గ్రామపంచాయతీ కార్యాలయంలో సంప్రదించాల‌ని పేర్కొన్నారు.

/////////////////////////////////////////////////////////////////////////////

మార్చి 28న ఆర్మీ అభ్యర్థులకు ఉచిత శిక్షణకై ఎంపిక… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి
మార్చి 28న ఆర్మీ రిక్రూట్మెంట్ లో రాత పరీక్షకు, ఫిజికల్ టెస్టుకు ఉచిత శిక్షణ అందించేందుకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఫిజికల్ & మెడికల్ టెస్ట్ నిర్వహించ‌నున్న‌ట్టు పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో ఆర్మీ అభ్యర్థులకు ఉచిత దేహదారుఢ్య, మెడికల్, వ్రాత పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచిత రాత పరీక్షకు సంబంధించిన మరియు శరీర దారుఢ్యానికి సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించాలని కోరారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నేరుగా స్టేడియం కి వచ్చి పరీక్షలో పాల్గొనవచ్చును కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *