Local News” 07.04.2025 శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

Local News”  గ్రామ గ్రామాన నేత్ర పర్వంగా శ్రీ సీతా రాములోరి కళ్యాణం…
హాజరైన భక్త కోటి భక్తజనం..
శంకరపట్నం డిసీ ప్రతినిధి
శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం గ్రామ గ్రామాన నేత్రపర్వంగా పేద పండితుల మంత్రోత్సవాలు, భక్త కోటి జనం నడుమ శ్రీ సీతారాములోరి కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, మొలంగూర్, కన్నాపూర్, కాచాపూర్, ఎరడపల్లి, రాజాపూర్, కరీంపేట్, తాడికల్, కొత్తగట్టు, గద్దపాక, ఆముదాలపల్లి, ముత్తారం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వేద పండితుల మంత్రోత్సవాలతో శ్రీ సీతారాముల కళ్యాణం, ఉత్సవాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని మహిళలు తమ ఇండ్ల నుండి స్వామి వారి కళణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు, వస్త్రాలు, పూలు పండ్లు, సమర్పించారు. కళ్యాణ మండపాలు భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////////////

బిజెపి ఆవిర్భావ వేడుకలు… పార్టీ జెండా ఆవిష్కరించిన నరేందర్…
శంకరపట్నం డిసి ప్రతినిధి 


బిజెపి ఆవిర్భావ వేడుకలను మొలంగూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసారపు నరేందర్ పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6 న పార్టీ ఆవిర్భవించిందని, నాడు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ సారథ్యంలో పార్టీ ముందుకు సాగిందని, నాటినుండి నుండి నేటి వరకు పేదబడుకు బలహీన వర్గాల కోసం పార్టీ ఎనలేని సేవ చేస్తుందన్నారు. ఆవిర్భావ వేడుకలు పార్టీ ఆదేశం మేరకు, గ్రామ, గ్రామాన, నిర్వహిస్తున్న‌ట్టు తెలిపారు. బిజెపి దేశ ప్రజలకు నాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా, నేను నరేంద్ర మోడీ భారత ప్రధానిగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంద‌న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాయంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని చెప్పారు. మోడీ ప్రధానిగా చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలు నేతలను ఆకర్షిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి పార్టీ అధికార చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య బూత్ అధ్యక్షులు దాసారపు తిరుపతి, బూతు ప్రధాన కార్యదర్శి రాయిని వినోద్, సీనియర్ నాయకులు కొత్తకొండ రాజేష్, మాచర్ల కుమార్, రాయిని అనిల్, తుమ్మరాజు,మొలుగూరి మల్లేష్ పుట్టపాక శ్రీనివాస్, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.

/////////////////////////////////////////////////////////////////////

శ్రీ సీతా రాములోరి కళ్యాణం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి 


శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జరిగిన శ్రీ సీతారాములోరి కళ్యాణాన్ని వేద పండితులు అంగరంగ వైభవంగా భక్త కోటి జనం నడుమ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్, సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలంలోని, గుండారంలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్, శ్రీ సీతారాము లోరి కళ్యాణానికి హాజరై ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల్లోని తాజా మాజీ ప్రజా పతినిధులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తకోటి జనం పాల్గొన్నారు.

/////////////////////////////////////////////////////////////////////////////

తండ్రి సమాధిపై నాగలి గుర్తు.. ప్రేమ‌ను చాటుకున్న కుమారులు
సంస్కరణ సభలో వక్తల ప్రశంసలు పొందిన యువరాజ్…
శంకరపట్నం డిసీ ప్రతినిధి  


తండ్రి రైతుగా ఎనలేని సేవ చేసి ఇటీవల మృతి చెందగా ఆయన జ్ఞాపకార్థం అత‌ని సమాధిపై నాగ‌లిని ఏర్పాటు చేసి త‌న‌యులు త‌మ ప్రేమ చాటుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, గద్దపాక గ్రామానికి చెందిన శనిగరపు చంద్రయ్య అనే రైతు ఇటీవల మరణించారు. చంద్ర‌య్య స‌మాధిపై అత‌ని కుమారులు శ‌నిగ‌ర‌పు యువ‌రాజ్‌, అత‌ని సోద‌రుడు బాబాబురావులు తండ్రి జ్నాప‌కార్థం నాగ‌లిని ఏర్పాటు చేసి త‌మ ప్రేమ‌ను చాటుకున్నారు. ఆదివారం చంద్ర‌య్య సంస్మ‌ర‌ణ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వ‌క్త‌లు మాట్లాడారు. శనిగరపు చంద్రయ్య స్మారకార్థం అతని కుమారులు యువరాజ్, బాబురావు నిర్మించిన సమాధి పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. రైతు సమాధిపై నాగలి పెట్టి సమాధి నిర్మించిన చరిత్ర ఎక్కడా లేదని తెలిపారు. చంద్రయ్యను చిరకాలం రైతుగా గుండెల్లో నిలిచిపోయే విధంగా సమాధిపై స్మార‌క స్థూపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. యువరాజ్, బాబురావు సేవలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని సంస్కరణ సభకు హాజరైన వక్తలు కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యులు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ జెడ్పిటిసి, తాళ్లపల్లి లక్ష్మణ్, శంకరపట్నం మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ పులికోట రమేష్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బామండ్ల రవీందర్, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ భోగి పద్మ, మండల కళాకారుల మహిళా అధ్యక్షురాలు రజిని, యువరాజ్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////////////////

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *