New Airport” తెలంగాణాలో విమానాశ్రయాల ఏర్పాటు జోరందుకుంది. వరంగల్ తర్వాత ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కల ఇప్పటి కాదు.. భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందే ఇక్కడ విమానాలు ఎగిరిన ఘన చరిత్ర ఆదిలాబా ద్ కు ఉంది. తెలంగాణాను నిజాం పరిపాలిస్తున్న కాలంలో ఆదిలాబాద్ ప్రాంతం యుద్దవిమానాలకు ఊపిరిపోసిన చరిత్ర ఉన్నది. 1930వసంత్సరంలో అప్పటి నిజాం రాజులు యుద్ధభూమికి వెళ్లే యుద్ధ విమానాలకు ఫ్యూయల్ నింపేందుకు 369 ఎకరాల భూమిలో ఏరోడ్రోమ్‌ను స్థాపించారు. ఆ తర్వాత 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ ఏరోడ్రమ్ భారత వైమానిక దళం నియంత్రణలోకి వెళ్లింది. 1970వ సంవత్సరం చివరి వరకు పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే హెలికాప్టర్లకు ఇంధనం నింపే కేంద్రంగా దీనిని ఉపయోగించారు. 2014లో ఏరోడ్రోమ్‌ను పూర్తి స్థాయి వైమానిక దళ స్టేషన్‌గా ఐఎఎఫ్ మార్చాలని ప్రతిపాదించింది. అప్పటి నుండి ఇప్పటి దాకా ఆ ఏరోడ్రమ్ లో ఎప్పుడెప్పుడు విమానం ఎగురుతుందా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వాయు సేన గ్రీన్ సిగల్ ఇవ్వడంతో ఆకాశమంతా ఆశలను మోసుకొచ్చినట్టైంది. 2017లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రోమ్‌ను ఆనుకుని ఉన్న కచ్కంటి, ఖానాపూర్, తంతోలి, అనుకుంట గ్రామాల పరిధిలో 1,592 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో విమానశ్రయ ఆశలకు ఊపిరిపోసినట్టైంది. 2018లో ఇదే హామీని ఎన్నికల్లో తెర మీదకి తెచ్చిన బీజేపీ, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న పరిస్థితులపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ అమిత్ కుమార్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీరజ్ గుప్తాలతో కూడిన బృందం సర్వే చేసి ఓ రిపోర్ట్ ను కేంద్రానికి పంపింది. తాజాగా 2023 లోను బీజేపీ ఎన్నికల హామీలోకి చేరిన విమానశ్రయ ఏర్పాటు తాజాగా ఎయిర్ క్రాప్ట్ కు కేంద్రం, వాయుసేన గ్రీన్ సిగల్ ఇవ్వడంతో ఆదిలాబాద్ జిల్లా వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఏది ఏమైనా దశాబ్దాల కల నెరవేరబోతుండటంతో ఇన్నాళ్లకైనా అడవుల జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తోంది జిల్లా ప్రజానికం.
PM Modi” శ్రీలంక పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ .. వీడియో
Polycet” తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం నమూనా మరియు సిలబస్
Dell” తేలికగా విద్యార్థులకు ఉపయోపడే…. తక్కువ ధరలో డెల్ కంపెనీ నుంచి ల్యాప్ టాప్..
