Local news” 08.04.2025 ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వార్త‌లు

Local news”  పౌష్టికాహారం ఎంతో ఆరోగ్యం..
ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలి….
వైద్యాధికారి శ్రావణ్ కుమార్…. 


శంకరపట్నం డిసీ ప్రతినిధి
క్షయ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని మండల వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, ఆరోగ్యం పై అవగాహన కల్పించి క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం కల్పించేందుకు సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్యశాలల సేవలను వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలన్నారు. క్షయ టీబి వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు మందులు అందజేస్తూ 1000 రూపాయలను ఖాతాలో వేయడం జరుగుతుందని తెలిపారు. టీబి క్షయ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యశాలలో కార్యక్రమాలు నిర్వహించి రోగులకు పౌష్టిక ఆహారాన్ని అందజేయడం జరిగిందని వైద్యాధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ఆయుర్వేదిక్ డాక్టర్సంధ్య, సిహెచ్ఓ భాస్కర్ వైద్యశాల సిబ్బంది. రోగులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////////////////////////////////

సీతారాముల పట్టాభిషేకానికి పట్టు వస్త్రములు సమర్పించిన … కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ .. 

అపర అయోధ్య ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకానికి సోమవారం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టు వస్త్రములు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సుధాకర్ మంత్రికి ఘనంగా శాలువాతో సన్మానం చేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదములు అందించారు. సీతారాముల పట్టాభిషేకాన్ని చూసి సంజయ్ కుమార్ పునీతులయ్యారు. పట్టాభిషేకానికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////////////////////////

ఏప్రిల్ 14 లోపు రాజీవ్ యువ‌వికాసానికి నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి…..  పెద్దపల్లి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జే. రంగారెడ్డి

ఏప్రిల్ 14 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జే. రంగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం ఫోటో ,స్టడీ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్, రవాణా రంగ పథకాల కోసం శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాల కోసం పట్టాదార్ పాస్ పుస్తకం, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ధృవీకరణ పత్రాలతో ఆన్ లైన్ నందు దరఖాస్తుల సమర్పించాలని అన్నారు.
వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 55 సంవత్సరాల వయసు గల వారు, వ్యవసాయ అనుబంధ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేల రూపాయల, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా మైనారిటీ కార్పోరేషన్ /ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద మైనారిటీ నిరుద్యోగులను స్వయం ఉపాధి పథకాలు అందించడానికి ప్రణాళిక ఆమోదించిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల నిరుద్యోగ మైనారిటీ యువత ఆన్ లైన్ పోర్టల్ వెబ్సైట్ నందు. లేదా సంబంధిత మండల ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణాలలో మున్సిపల్ కార్యాలయాల్లో ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ నందు గల మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

—————————————————————————–

పారిశుద్ధ్య కార్మికులందరికీ బీమా ప్రీమియం చెల్లించాలి .. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి


కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 2700 పారిశుధ్య కార్మికులందరికీ బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు.
మరణించిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ చెక్కులు పంపిణీ చేశారు. ఇల్లందకుంట మండలం మల్యాల కు చెందిన గురుకొండ రాజబాబు, శ్రీరాముల పల్లెకు చెందిన తిరుపతి మరణించగా వారి కుటుంబ సభ్యులకు పి.ఎం.జె.జె.బి.వై పథకం ద్వారా మంజూరైన రూ.రెండు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఇందుకు సంబంధించిన ప్రీమియం గత ఏడాది జిల్లా యంత్రాంగమే చెల్లించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో జిల్లా యంత్రాంగం తరపున జిల్లాలోని సుమారు 2700 మంది పారిశుద్ధ్య కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించామని గుర్తు చేశారు. కార్మికుల నుండి ఒక్క రూపాయీ తీసుకోకుండా సుమారు పది లక్షల రూపాయల వరకు బీమా చెల్లి ప్రీమియం చెల్లించిందన్నారు. వివిధ కారణాలవల్ల కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు.
ఈ ఏడాది కూడా కార్మికులందరికీ బీమా ప్రీమియం జిల్లా యంత్రాంగం ద్వారానే చెల్లించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. హెల్త్ క్యాంపులు నిర్వహించి కార్మికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని అన్నారు. గతంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల ద్వారా కొందరు పారిశుధ్య కార్మికుల్లో టీబీ వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తున్నామని, న్యూట్రిషన్ కిట్టు తో పాటు ప్రతి నెలా వేయి రూపాయలు అందజేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు రూ.20 లక్షల బీమా ప్రీమియం చెల్లించిన మున్సిపల్ కమిషనర్ ఆయూబ్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, డిటిడిఓ పవన్ కుమార్, ఆర్డిఓ మహేశ్వర్, యూనిసెఫ్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎల్డీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////////////

అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి..

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
కమాన్ పూర్ మండలానికి చెందిన కల్వల జయ‌ తనకు కాగజ్ నగర్ లో ఉన్న రేషన్ కార్డు ను కమాన్ పూర్ మార్చాలని కొరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సి హెచ్. శ్రీమన్ నారాయణ ఎల్ఆర్ఎస్ లో మా తండ్రి పేరు మీద ఉన్న స్థలం క్రమ బద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా నిషేధిత స్థలం అని వస్తుందని, మా స్థలం ఉన్న ప్రాంతంలో చుట్టూ ఇండ్లు భవనాలు ఉన్నాయని, తమకు క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

గోదావరిఖని పట్టణానికి చెందిన జి.ఆర్. ప్రసాద్ 49వ డివిజన్ లో రోడ్డును ఆక్రమిస్తూ ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుందని, దీనిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రామగుండం మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ వెంటనే విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *