Local News” 11.04.2028 శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

Local News” ల‌బ్దిదారుని ఇంట్లో క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యే భోజ‌నం

ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం బువ్వ పెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం… ఎమ్మెల్యే

శంకరపట్నం డిసీ ప్రతినిధి 


తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి బుక్కెడు సన్న బియ్యం అందించాలని లక్ష్యంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన‌ట్టు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని వంకాయ గూడెం గ్రామంలో గురువారం మమత గణేష్ అనే పేద కుటుంబంతో కలిసి సన్న బియ్యం బువ్వ తో ఎమ్మెల్యే, క‌రీంన‌గ‌ర్ జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం శాసన సభ్యులందరూ ప్రతి పేద కుటుంబానికి బువ్వ పెట్టాలని లక్ష్యంతో రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టార‌న్నారు. అర్హులైన తెలుపు రేషన్ కార్డు లబ్ధిదారులకు అందజేస్తున్న‌ట్టు చెప్పారు. వంకాయగూడెం గ్రామంలో చలిగంటి మమత-గణేష్ దంపతుల ఇంట్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయి, లక్ష్మీ కిరణలతో కలిసి సహపంక్తి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. సన్న బియ్యం పథకంపై ఆ దంపతుల అభియాలను అడిగి తెలుసుకుని, ఇప్పటి వరకు చౌకధరల దుకాణాల్లో దొడ్డు బియ్యం పొందిన రేషన్ దారులు, ఇప్పుడు సన్న బియ్యంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పథకంపై ఆదరణ లభిస్తోందన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మ‌మ‌త కుటుంబ యోగక్షేమాలు కలెక్టర్ పమేలాసత్పతి అడిగి తెలుసుకున్నారు. పేద కుటుంబానికి చెందిన తమ ఇంటికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా శాఖ అధికారులు, మండల శాఖ అధికారులు, తమ ఇంట్లో భోజనం చేయడంపై మమత-గణేశ్ దంపతులు సంతోషం పట్టలేక తబ్బిబ్బయ్యారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బత్తుల భాస్కర్, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, మాజీ జెడ్పిటిసి ,పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అజయ్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
శంకరపట్నంలో చెక్కుల పంపిణీ..
మాన‌కొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ…
శంకరపట్నం డిసీ ప్రతినిధి


తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని మాధవ సాయి గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మండలానికి చెందిన 50 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 11,56,500 రూపాయల విలువ గల చెక్కులతోపాటు 132 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించే సహాయాలతో లబ్ధిపొందాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల తహసీల్దార్ బత్తుల భాస్కర్, ఎంపీడీవో గోల్కొండ కృష్ణప్రసాద్, టిపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కె.పద్మ, కొత్తగట్టు దేవస్థానం చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపెల్లి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అజయ్, కేశవపట్నం గ్రామశాఖ అధ్యక్షుడు సదానందంతోపాటు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////////////

రాజ్యాంగ పరిరక్షణకే పాదయాత్ర …
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ..
శంకరపట్నం డిసీ ప్రతినిధి


రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సవిధాన్ పాదయాత్రలు నిర్వహిస్తున్న‌ట్టు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాల పూర్, ఇప్పలపల్లె, కరీంపేట్, గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సవిధాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు, కరెన్సీ పై ముద్రించిన గాంధీ ఫోటోను తొలగించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. బిజెపి కుట్రల నుండి వాటిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్ప‌రు. ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని గౌరవిస్తాయ‌ని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, టి పి సి సి సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్‌, వ్య‌వసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, బీసీ సెల్ అధ్యక్షుడు పవన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, యూత్ అధ్యక్షుడు ఆడెపు అజయ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *