Local News” 10.04.2025 శంక‌ర‌ప‌ట్నం న్యూస్‌

Local News”  సాగునీటి కోసం రోడ్డు ఎక్కిన శంకరపట్నం రైతులు..
శంకరపట్నం డిసీ ప్రతినిధి 

వేసిన పంటలు సాగునీరు లేక ఎండిపోయే ప్రమాదం

ఉందని, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి  సత్యనారాయణ స్పందించి నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులకు కోరారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల రైతులు బుధవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని ఏప్రిల్ 20 వరకు విడుదల చేసి వేసిన పంటలు చేతికందే విధంగా రైతులను ఆదుకోవాలని కోరారు. నీటి విడుదల కోసం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి, నీటి విడుదల కోసం  చొరవ తీసుకొని నీటిని విడుదల చేయించి రైతులను ఆదుకోవాలని కోరారు. సమాచారం తెలుసుకున్న కేశవపట్నం ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో ధర్నా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విర‌మించారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం, కరీంపేట  గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////////////
ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ వేడుకలు.. 

జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్…

శంకరపట్నం డిసి ప్రతినిధి


ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ వేడుకలను బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి టిపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్ ఎస్ యు ఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ఎన్ఎస్ యు ఐ కార్యకర్తలేనన్నారు. ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు కాంగ్రెస్ కు గుండెకాయ లాంటివారని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీకి యువత అండగా ఉండాలని, 1970లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ ఎస్ యు ఐ అనుబంధ సంస్థను ఆవిర్భావం చేశారని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు అయాన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ఇమ్రాన్, కార్యదర్శులు అస్మత్, వెంకటేష్, మండల యువజన కాంగ్రెస్ కార్యదర్శి గండికోట రవి, మాజీ సర్పంచులు గొడిశాల రాజ కొమురయ్య, కీసర సంపత్ సుజాత, కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షుడు మొలుగూరి సదానందం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మహమ్మద్ షారుక్, ప్రవీణ్, దశరథం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////////////////////////

మ్యాథమెటిక్స్ లో మొలంగూర్ విద్యార్థిని ప్రతిభ…
ప్రశంసాపత్రం అందుకున్న విద్యార్థిని సుస్మిత..
శంకరపట్నం డిసీ ప్రతినిధి 


ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల మొలంగూర్ విద్యార్థిని మ్యాథమెటిక్స్ లో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నీరజ మాట్లాడారు. అల్ఫోర్స్ పాఠశాల ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపియాడ్ లో మొలంగూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి అభ్యసిస్తున్న ఎన్ సుస్మిత జిల్లా స్థాయిలో పదో ర్యాంకు జాతీయస్థాయిలో 387 వ ర్యాంకు సాధించిందని తెలిపారు. సుష్మిత ప్రతిభకు నిర్వాహకులు ప్రశంస పత్రాలను అందజేశారని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన సుష్మితను మండల విద్యాధికారి ఏం లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////

మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ…
శంకరపట్నం డిసి ప్రతినిధి 

మోడల్ స్కూల్ విద్యార్థులు ఒలింపియాడ్ మాథ్స్, సైన్స్ విభాగంలో ప్రతిభ కనబరిచినట్లు మోడల్స్ ప్రిన్సిపాల్ వి. సరిత బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరిత మాట్లాడుతూ.. పాఠశాలలో 8వ‌ తరగతి చదువుతున్న ఎస్ రక్షిత గణిత విభాగంలో, 9వ తరగతి విద్యను అభ్యసిస్తున్న కె తేజేశ్వర్ సామాన్య విభాగంలో, ప్రతిభ కనబరచడంతో ఓల‌పియం యాడ్ ప్రశంసా పత్రాలకు ఎంపిక య్యార‌ని తెలిపారు. ఈ మేర‌కు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి చేతులమీదుగా కరీంనగర్ పట్టణంలో ప్రశంస పత్రాలను అందుకున్నట్లు తెలిపారు. పాఠశాలలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించినట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి తన ప్రతిభను కనబరిచి వివిధ రంగాల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎస్ రజిత, స్వప్న, రజిత, సతీష్, రాజు, శివశంకర్, వనజ, మధుకర్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////////////

విద్యార్థుల నడవడికను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలి…
డ్రగ్స్ మహమ్మారిని తరిమివేయండి…
అవగాహన సదస్సు లో సీఐ వెంకట్..
శంకరపట్నం డిసి ప్రతినిధి


తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల నడవడికను అనుక్షణం గమనిస్తూ బంగారు బాటలు వేయాలని హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం యాంటీ డ్రగ్స్, డ్రగ్స్ పై అవగాహన సదస్సును కేశవపట్నం ఎస్సై కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన హుజురాబాద్ రూరల్ సిఐ వెంకట్ మాట్లాడుతూ… విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే కన్న తల్లిదండ్రులు పిల్లల నడవడికను, వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల నడవడిక పై ప్రత్యేక దృష్టి సారించి, చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరు పాల్గొన్నారు.

/////////////////////////////////////////////////////////////////////////////////

దొంగతనాలను అరికట్టేందుకు.. కలిసికట్టుగా కృషి చేయాలి….
రూరల్ సీఐ వెంకట్….
శంకరపట్నం డిసీ ప్రతినిధి


ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలను అరికట్టేందుకు విద్యుత్ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కలిసికట్టుగా కృషిచేసి దొంగతనాలను అరికట్టాలని హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ విద్యుత్ శాఖ ఉద్యోగులకు, పోలీసులకు సూచించారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో, ఎస్ ఐ కొత్తపల్లి రవి, తాడికల్ సబ్ స్టేషన్ ఏఈ సంపత్ రెడ్డి, ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్లు లైన్మెన్లు జూనియర్ లైన్మెన్లు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని, దొంగతనాలు అరికట్టేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు పోలీసులు కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగి నిఘా పటిష్టతను పెంచి ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలను అరికట్టి ప్రభుత్వ ఆస్తులను సమిష్టిగా కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవి, విద్యుత్ శాఖ ఏఈ సంపత్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్లు లైన్మెన్లు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *