Trump” అగ్రరాజ్యం అమెరికాలో కలకలం రేపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. శనివారం పెన్సిల్వేనియాలో శనివారం ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఓ బుల్లెట్ ట్రంప్ చెవితాకుతూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ ఓపెన్ చేశారు. ఈ కాల్పుల్లో నిందితుల్లో ఒకరు మరణించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు. కాల్పుల ఘటన గురించి సెక్యూరిటీ ఎజెన్సీల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఈ ఘటనపై బరాక్ ఒబామ కూడా స్పందించారు.
స్పందించిన భారత ప్రధాని మోడీ
అమెరికా మాజీ అధ్యక్షుడిపై జరిపిన కాల్పులపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Hyderabad news” ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..
Up Bus accident” ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి.. 30 మందికి గాయాలు
Viral Video”చుట్టుముట్టిన మొసళ్లు.. కొట్లాడి తప్పించుకున్న జీబ్రా.. వీడియో వైరల్