పంటను కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఓ రైతు ఏర్పాటు చేసిన కంచె మరో రైతు ప్రాణం బలిగొన్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హైదరాసాయి పేటకు చెందిన జానీమియా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జానిమియా కుమారుడు యాకూబ్ పాషా ఎల్‌క్టీష్రిన్ గా పనులు చేస్తుంటాడు. పొలం పనుల్లో తండ్రికి సహాయం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం మోటారు ఆన్ చేసేందుకు పొలం దగ్గరకు వెళ్లాడు. వెంకన్న అనే రైతు కోతుల బెడద తట్టుకోలేక పొలం చుట్టు విద్యుత్ తీగలు అమర్చాడు. యాకూబ్ పొలం వద్దకు వెళ్తున్నప్పుడు విద్యుత్ తీగలు తగిలి అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంకన్న, అతడి కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాకూబ్‌కు సంవత్సరం వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు.
నాన్నా సింహాలు కూడా గుంపుగా వస్తాయి.. వీడియో వైరల్
Viral videos” సైకిల్‌ను బండిగా మార్చేసిన తాత… వీడియో వైరల్