Ambedkar sangham” ఎస్సైని సన్మానించిన అంబేద్కర్ సంఘ నాయకులు…

Ambedkar sangham” నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్…
శంకరపట్నం డిసి ప్రతినిధి…
నూతనంగా కేశవపట్నం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కట్కూరి శేఖర్ రెడ్డిని మంగళవారం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మానకొండూర్ నియోజకవర్గం, అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నం ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కట్కూరి శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వ కలిసి సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంపేట శాఖ అధ్యక్షులు రాజయ్య, ప్రధాన కార్యదర్శి సురేష్, నాయకులు పవన్, తిరుపతి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *