Anganwadi Services” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా |
మహిళలు, చిన్నారుల ఆరోగ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అంగన్వాడీ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్లు అరుణ, పద్మ పిలుపునిచ్చారు.
శుక్రవారం రోజున మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలోని వంకాయగూడెం, గుడాటిపల్లె గ్రామాల్లో డ్రై డే ఫ్రైడే గ్రామసభలు నిర్వహించగా, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:
“ప్రభుత్వాలు మహిళలూ, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలి,” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సహాయం అవసరమైతే సంప్రదించండి:
-
మహిళల సమస్యలకు: 181
-
చిన్నారుల రక్షణకు: 1098
-
వృద్ధుల సంక్షేమానికి: 14567
-
సైబర్ క్రైమ్‌కు: 1930
ప్రభుత్వ శాఖల ద్వారా శీఘ్ర స్పందనతో సహాయాన్ని అందిస్తారు.
Oppo Reno14 5G” సరికొత్త డిజైన్‌తో శక్తివంతమైన ఫోన్ ఇప్పుడు మార్కెట్‌లో
Tv Deals” టీవీలపై భారీ ఆఫర్లు – ఇప్పుడు టీవీ కొనడానికే సరైన సమయం!
