Congress Manakondur” తెలంగాణలో ప్రజాపాలనకు ఆదరణ.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

Congress Manakondur” తిమ్మాపూర్, జూలై 9 (డిసి ప్రతినిధి):
తెలంగాణలో ప్రజా పాలన పునర్నిర్మాణ దిశగా సాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన  కార్యక్రమంలో, బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


మాజీ ప్రజాప్రతినిధులతో పాటు అనేకులు కాంగ్రెస్‌లోకి

ఈ సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన తిమ్మాపూర్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కరివేద సింగారెడ్డి, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కరివేద సుధాకర్ రెడ్డి, మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య, కుల సంఘాల నాయకులు సహా అనేక మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సత్యనారాయణ వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.


“పదేళ్ల నియంత పాలనకు ప్రజలు చెక్ పెట్టారు” – ఎమ్మెల్యే సత్యనారాయణ

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలన ప్రజలకు చాలు అన్న భావన ఏర్పడింది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు,” అన్నారు.

ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాకేంద్రిత పాలన సాగుతోందని, ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు.


“కలిసొచ్చే వారిని స్వాగతిస్తాం – సముచిత స్థానం కల్పిస్తాం”

కాంగ్రెస్ పార్టీ విధానాలను నమ్మి, సమష్టిగా పని చేసేందుకు ముందుకు వచ్చే వారికి తగిన గుర్తింపు, బాధ్యతలు ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Srisailam Dam” శ్రీశైలం డ్యాం గేట్స్ ఓపెన్   అద్భుతమైన దృశ్యాల్ని అందించిన డ్రోన్ వీడియో

Nimisha Priya” భారతీయ నర్సుకు యెమెన్‌లో జూలై 16న ఉరిశిక్ష అమలు కార‌ణమిదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *