Annadata Sukhbhava” ఆగస్టు 2న ‘అన్నదాత సుఖీభవ’   రైతుల ఖాతాల్లోకి 20 వేలు …

Annadata Sukhbhav”  అమరావతి, జూలై 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని త్వరలో అమలు చేయనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్లకు పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చారు.

ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేయనుంది. ఈ పథకాల ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.20,000 నగదు అందించబడుతుంది. ఇందులో కేంద్రం రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కేటాయిస్తోంది.

రాష్ట్రంలో 46.85 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లాభం పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు రూ.2,342.92 కోట్ల నిధులు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎం కిసాన్ తొలి విడతలో కేంద్రం రూ.831.51 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అమరావతిలో నిర్వహించిన సవీక్షలో నగర అభివృద్ధి, పచ్చదనం పెంపు, ట్రంక్ రోడ్లు, గ్రీన్ బెల్ట్, రివర్ ఫ్రంట్ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సూచనలు ఇచ్చారు. పార్కులు, ఔషధ మొక్కల నాటుపై దృష్టి పెట్టాలని, స్థానిక వృక్షజాతుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ASUS Vivobook 15 – పవర్ మీ చేతిలో!
Ryzen 7 5825U Processor
16GB RAM + 512GB SSD
ఫాస్ట్ & స్లిక్ లాప్‌టాప్ – స్టడీకి, వర్క్‌కీ పర్ఫెక్ట్!

⚡ 1.7 Kg మాత్రమే – ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు
బ్యాటరీ బ్యాకప్ – రోజంతా మజా
బ్యాక్లిట్ కీబోర్డ్ – నైట్ టైమ్ వర్క్ కూడా సులభం
Office 2024 & Microsoft 365 – 1 Year ఫ్రీ!

ఇన్ని ఫీచర్లు కలిగిన లాప్‌టాప్ ₹45,990 మాత్రమే!!

అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు  https://amzn.to/4fdSAEwలింక్ ను క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *