Karimnagar Collector” మున్సిపల్ ఎన్నికలకు  క‌ట్టుదిట్ట‌మైన‌ ఏర్పాట్లు చేయండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని

Karimnagar Collector”  కరీంనగర్   రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర రాజధాని నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా:

  • నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించాల‌న్నారు.

  • స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిబంధనలకు లోబడి పారదర్శకంగా జరగాల‌న్నారు.

పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘా

ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ బృందాల నియామకం, డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికకు సంసిద్ధం

కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన  ఫారం 2′ లను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల ప్రక్రియ గురించి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *