పెండ్లంటే కొత్త జీవితం ముఖ్యంగా ఆడపిల్లలు ఎన్నోన్నో ఊహించుకుని అత్తారింట్లో అడుగుపెడుతారు. భర్త అత్తమామలు, పిల్లలతో కలిసి నూరేండ్లు హాయిగా గడపాలనుకుంటారు. సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు, మనస్పర్థలు కామనే. కొన్నిండ్లళ్లో సీరియళ్లో ఉండేటువంటి క్యారెక్టర్ల వలె రాకాసి అత్తలూ ఉంటారు. కొంత మంది కోడళ్లూ అత్తలను కాల్చుతింటూంటారు. కానీ హిమాచల్‌ప్రదేశ్లో జరిగిన ఘటన మాత్రం అత్యంత పాశవికంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌జిల్లా భోరంజ్ సభ్‌డివిజన్‌కు చెందిన ఓ మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె తనపుట్టింటికి వెళ్లి అక్కడే కొన్ని రోజులు ఉంది. ఆ తరువాత తిరిగి తన అత్తవారింటికి చేరింది. ఇన్ని రోజులు లవర్‌తో వెళ్లిపోయావంటూ హింసించారు. ఇంతటితో ఆగకుడా కోడలి జుట్టను కట్ చేసి నల్లరంగు పూస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు బాధితురాలి వాగ్మూలం తీసుకున్నారు. అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సొంతజిల్లా కావడంతో బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
मुख्यमंत्री सुखविंदर सुक्खू जी के गृह जिला में मानवता शर्मसार।#जनता_विरोधी_कांग्रेस_सरकार #कांग्रेस_का_कुप्रशासन#Congress #bhoranj#Hamirpur #cmsukkhu #himachal #himachalpradesh pic.twitter.com/g1jQvi0cYk
— BJP Himachal Pradesh (@BJP4Himachal) September 15, 2023
మద్యం సీసాలుఎత్తుకెళ్లిన వరుడు.. పెండ్లి కొడుకు అరెస్ట్.. పెండ్లికూతురు ఏం చేసిందంటే..