AP ECET 2025″ తుది దశ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..

AP ECET 2025″ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) AP ECET 2025 తుది దశ కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిప్లొమా ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులైన అర్హులైన అభ్యర్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి ఈ తుది దశ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.


ముఖ్య తేదీలు – AP ECET 2025 Final Phase Counselling

  • ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & రిజిస్ట్రేషన్: జూలై 18 – 19, 2025

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ఆన్‌లైన్): జూలై 18 – 19, 2025

  • ఆప్షన్ ఎంట్రీ (తాజాగా తప్పనిసరిగా చేయాలి): జూలై 18 – 20, 2025

  • సీటు కేటాయింపు ఫలితాలు: జూలై 22, 2025 సాయంత్రం 6 గంటల తర్వాత


ఎవరు ఈ తుది దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు?

  • మొదటి దశలో సీటు వచ్చి, రిపోర్ట్ చేయని వారు

  • సీటు రాని కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన వారు

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసినా ఆప్షన్ ఎంటర్ చేయని వారు

  • ఇప్పటికే రిపోర్ట్ చేసినా మెరుగైన ఎంపిక కోసం ప్రయత్నించదలిచిన వారు

  • కేటాయించిన సీటును క్యాన్సల్ చేసి మళ్లీ ప్రయత్నించే వారు

  • ఈ దశలో తొలిసారిగా నమోదు చేసుకునే తాజా అభ్యర్థులు

గమనిక:
పాత సీటుతో సంతృప్తిగా ఉన్న అభ్యర్థులకు తిరిగి హాజరయ్యే అవసరం లేదు. కానీ కొత్త ఆప్షన్ ఎంటర్ చేస్తే, కొత్త సీటు వస్తే పాతది ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.


అప్లోడ్ చేయాల్సిన తప్పనిసరి సర్టిఫికెట్లు

  • APECET-2025 ర్యాంక్ కార్డ్

  • హాల్ టికెట్

  • డిప్లొమా / డిగ్రీ మార్క్స్ మెమో

  • ప్రొవిజనల్ సర్టిఫికెట్

  • పుట్టిన తేదీకి ఆధారంగా 10వ తరగతి (SSC) సర్టిఫికెట్

  • స్టడీ సర్టిఫికెట్లు (VII నుండి డిప్లొమా వరకు లేదా IX నుండి డిగ్రీ వరకు)

  • కుల (Caste) సర్టిఫికెట్ (అర్హత ఉన్నవారికి)

  • EWS / ఆదాయ /  రేష‌న్ కార్డు

  • నివాస ధ్రువీకరణ పత్రం (ప్రైవేట్ పాఠశాల చదివినవారికి)


సర్టిఫికెట్ వెరిఫికేషన్ సూచనలు

  • స్కాన్ చేసిన స్పష్టమైన ప్రతులు మాత్రమే అప్లోడ్ చేయాలి

  • హెల్ప్‌లైన్ సెంటర్‌ అధికారులు ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ చేస్తారు

  • ఏదైనా డాక్యుమెంట్ క్లియర్‌గా లేకపోతే, మరొకసారి మాత్రమే అప్లోడ్ చేసే అవకాశముంటుంది

  • తరచుగా అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేయడం అవసరం


ఆప్షన్ ఎంట్రీకు సూచనలు

  • అన్ని అభ్యర్థులు కొత్తగా ఆప్షన్ ఎంట్రీ చేయాలి (పాతవి పరిగణలోకి తీసుకోబడవు)

  • ఫ్రీజు చేసిన ఆప్షన్లను తిరిగి మార్చలేరు – జాగ్రత్తగా ఎంచుకోవాలి

  • OTP రహస్యంగా ఉంచండి, ఇతరులకు చెప్పకూడదు


ఫైనల్ సీటు కేటాయింపు ఫలితాలు

  • జూలై 22, 2025 సాయంత్రం 6 గంటల తర్వాత, అధికారిక వెబ్‌సైట్‌లో సీటు కేటాయింపు ఫలితాలు విడుదల అవుతాయి.

https://ecet-sche.aptonline.in/ECET లింక్‌పై క్లిక్ చేసి నేరుగా ఈసెట్ సైట్‌కి వెళ్లొచ్చు..

ఇంటి కోసం బెస్ట్ వాటర్ హీటర్ వచ్చేసింది!
Bajaj Copper 1000W Immersion Rod Heater
✅ వేగంగా నీళ్లు వేడెక్కే టెక్నాలజీ
✅ యాంటీ-కరోసివ్ నికెల్ ప్లేటింగ్
✅ ISI అప్రూవల్ – భద్రత & నాణ్యత గ్యారంటీ
✅ 2 ఏళ్ల వారంటీ
✅ బ్లాక్/సిల్వర్ కలర్ లో అందుబాటులో ఉంది

ఇంట్లో శీతాకాలం లేదా రోజువారీ వినియోగానికి సరైన ఎంపిక!

అమెజాన్లో బుకింగ్ కోసం https://amzn.to/4eW9PKv లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *