Raja sab” ఇండియన్ సినిమా రంగంలో ప్రభాస్‌కి ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది. ‘బాహుబలి’ సీరీస్ తర్వాత, ఆయన సెలబ్రిటీ స్టేటస్ అంతర్జాతీయంగా మరింత పెరిగింది. దీంతో ప్రతి సినిమా విూదా ఆయన అభిమానులలో మరియు ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు క్రియేట్ అవుతుంటాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ నుండి ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రభాస్ కొత్త లుక్‌లతో, కామెడీ, హీరోయిజం రెండు మిక్స్ చేయడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మారుతి దర్శకుడిగా ప్రభాస్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక సంగీతాన్ని థమన్ అందిస్తున్న ఈ చిత్రంలో, తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చిందట. ‘ది రాజా సాబ్’ నుండి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేయాలనే ఆలోచన చిత్రబృందానికి ఉందని సమాచారం. ఈ పాట ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సోలో మాస్ సాంగ్‌గా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్ బీట్ పాటలు హిట్ అవుతున్న నేపథ్యంలో, థమన్ ఈ పాటకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి మాస్ రెస్పాన్స్ రావడంతో, సంగీతానికి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ పాట కూడా ప్రభాస్ యొక్క మాస్ ఛార్మ్‌కి తగినట్లుగా ఉండనుందని తెలుస్తోంది.
