Bjp” తిరుపతిలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కు బిజెపి నేత అనిల్ జన్మదిన శుభాకాంక్షలు

Bjp”

శంకరపట్నం, జూలై 11:
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపినట్టు బీజేపీ శంకరపట్నం మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ తెలిపారు.

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, హిందుత్వవాది అయిన బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, తిరుమల తిరుపతి దేవస్థానం లో ఏడుకొండల వారి సన్నిధిలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనిల్ మాట్లాడుతూ, బండి సంజయ్ దేశవ్యాప్తంగా పార్టీకి విశేష సేవలందిస్తున్న ఘన నాయకుడని, ఆయన శుభదినం తమకు గర్వకారణమని అన్నారు. తిరుమలలో ఈ సందర్భంగా పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *