Best Teacher Award” జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సంతోష్

Best Teacher Award”
శంకరపట్నం : డిసి ప్రతినిధి
కరీంనగర్ జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా కొరిమి సంతోష్ క‌లెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం,శంకరపట్నం మండలం, తాడికల్ గ్రామానికి చెందిన కొరిమి సంతోష్ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆలుటోరియంలో కలెక్టర్ పమేల సత్పతి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ పురస్కారం అవార్డు అందుకున్నారు. 2003లో వ్యాయామ విద్య ఉపాధ్యాయునిగా ట్రైనింగ్ పూర్తి చేసి 22 సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ లోని వసంత్ వ్యాలీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూ అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. ఈ అవార్డు రావడం పట్ల వసంత్ వ్యాలీ పాఠశాల చైర్మన్ ఏ,బుచ్చిరెడ్డి, కరస్పాండెంట్ ఏ, స్వరూప బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయ బృందం, క్రీడా సంఘాల బాధ్యులు,ఒలంపిక్ సంఘాల బాధ్యులు, ప్రభుత్వ ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, శంకరపట్నం మండలం తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ సంతోష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Redmi Pad Pro” పవర్‌ఫుల్ ఫీచర్లతో .. మీ డిజిటల్ అవసరాలకు అద్భుతమైన పరిష్కారం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *