Bjp Demands” ఇందిరమ్మ కమిటీల జోక్యం తగ్గించాలి..

Bjp Demands”
ఎంపీడీవో కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు..
శంకరపట్నం డిసి ప్రతినిధి
ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని బిజెపి మండల అధ్యక్షులు ఎనుగుల అనిల్ ఎనుగుల అనిల్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండల, ఎంపీడీవోకు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు.
శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల కోసం, ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు సంతకాలు లేని జిరాక్స్ మంజూరి ప్రతులు పంపిణి చేస్తూ, తామే ఇండ్లు ఇస్తున్నట్లు గ్రామాలలో ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ పంపిణి కార్యక్రమాలలో పంచాయతీ కార్యదర్శులు సైతం హాజరవుతున్నారన్నారు. ఇది కాకుండ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ నాయకులే ముగ్గులు పోస్తు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్మారని, ఇందిరమ్మ కమిటీ సాకుతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలను నివారించాలని చెప్పారు.

ఈ ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి, లబ్దిదారుల ఎంపిక విధానంలో ఇంటి నిర్మాణ పర్యవేక్షణ అధికారులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు , కేంద్ర ప్రభుత్వం నిధులు నిధులు కేటాయించి విడుదల చేస్తుందని, ఇండ్ల ప్రొసిడింగ్ పత్రాలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు కూడా ఉండాల‌ని అనిల్ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కమిటీల‌ను రద్దు చేయాలని ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ కు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఓ వినతి పత్రాన్ని అందజేసినట్లు అనిల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్, నాయకులు దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, అంతం రాజి రెడ్డి, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, మందాడి జగ్గారెడ్డి, బిజిలి సారయ్య, సుదగోని సారయ్య, దాసరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

 

వెబెల్‌కార్ట్ ప్రీమియం హోమ్ కీస్ వుడ్ కీ హోల్డర్
(29 సెం.మీ x 13.5 సెం.మీ x 0.4 సెం.మీ, వుడ్)
7 హుక్స్ – గృహ అలంకరణ కోసం అలంకారిక వస్తువు (బ్లాక్ కలర్)

Webelkart స్టోర్‌ను సందర్శించండి
⭐ రేటింగ్: 4.2 / 5 (197 సమీక్షలు)
#1 బెస్ట్ సెల్లర్ – వాల్ కీ హోల్డర్స్ విభాగంలో
ఈ నెలలో 1,000 మందికి పైగా కొనుగోలు చేశారు

ధర: ₹188.00 (81% తగ్గింపు)
అమెజాన్లో కొనుగోలు కోసం  https://amzn.to/4mjwpPEలింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *