ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్‌ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే వారు దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంగనర్ జిల్లా కేంద్రంలోని ఈఎన్ గార్డెన్‌లో శనివారం ఆ పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పైస్థాయి నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు. దేశమంతా మోదీ గాలి వీస్తోందన్నారు. బీజేపీ 350 సీట్లతో హ్యాట్రిక్ కొట్టడం ఖామయమన్నరు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పీఎం నరేంద్ర మోడీ వాగ్ధానాన్ని విస్మరించారు: న్యూడెమెక్రసి
కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని ,ప్రజల సొమ్మును దోచుకుతిన్నారని ఆరోపించారు. వెంటనే వాళ్ల అవినీతిని బయటపెట్టాలని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదటపడే వరకు ఈ విషయంలో ఆయనను మినహాయించాలని MP బండి సంజ య్ కుమార్ సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు. ఇక బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతేనన్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. బెజ్జంకి మండలాన్ని కరీంనగర్‌లో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్