Thursday , 21 November 2024

టార్గెట్ లోక్ స‌భ‌… బండికి ప‌గ్గాలు అప్ప‌జెప్పుతారా..?

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి… ఎన్నిక‌లకు ఆరు నెల‌ల ముందున్న వాతావ‌ర‌ణం వేరు ఎన్నిక‌ల‌కు నెల ముందున్న వాతావ‌ర‌ణం వేరు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు తెలంగాణాలో బీజేపీ టాప్‌గేర్ లో దూసుకెళ్లింది. కానీ అదే స్పీడ్‌లో డౌన్ అయ్యింది. క‌ర్ణుడి చావుకు నూరు కార‌ణాలు అన్న‌ట్టు ఈ ప‌రిస్థితికి కార‌ణాలు అనేకం అయ్యి ఉండ‌వ‌చ్చు అని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదంతా గ‌డిచిన క‌థ ఇప్పుడు ముందున్న‌ది లోక్ స‌భ ఎన్నిక‌లు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావ‌డం కోసం ఆ పార్టీ యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసింది. కానీ తెలంగాణాలో బీజేపీ ప‌రాజ‌యానికి కార‌ణాలు అన్వేషిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లతో పాటు ఓట‌ర్లు కూడా బండిని అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డమే కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రం పై బీజేపీ అధినాయ‌క‌త్వంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే అమిత్ షా గురువారం హైద‌రాబాద్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. అన్ని అంశాల‌పై క్షుణంగా చ‌ర్చించిన త‌రువాత అమిత్ షా బీజేపీ లీడ‌ర్ల‌కు క్లాస్ పీకిన‌ట్టు తెలుస్తోంది. క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని హెచ్చ‌రించారు. దాంతో పాటు బండికి మళ్లీ తెలంగాణలో పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది.. ప‌రీక్ష‌లు ఎప్పుడంటే…

2024లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్‌ షా తెలంగాణ బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో హోటల్‌లో నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నేతల గురించి ఆరా తీశారు. ప్రజల్లో ఎంత పలుకుబడి ఉంది.. వారి బలాబలాలపై విశ్లేషించారు. పార్టీ అంతర్గత విషయాలను బయట పెట్టోద్ద‌ని ఫైర్‌ అయ్యారు. 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని స్పష్టంచేశారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కనీసం 10 నుండి 12 స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకులు శక్తివంచన లేకుండా పనిచేయాలని చెప్పారు.

మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలో చేరుతాం

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేకపోయిందని జాతీయ నాయకులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకుతో పోల్చితే సీట్లు, ఓటింగ్‌ శాతం పెరిగినా ఆశించిన మేరకు ఫలితాలు రాబట్టలేకపోయామని అంతర్మథనం చెందుతున్నారు. గెలుస్తారు అనుకున్న అభ్యర్థులే ఓటమి చెందడం ఒకింత నాయకులనే కాకుండా విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కరీంనగర్‌ నుంచి బండి సంజరు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 20 ఏండ్లుగా హుజూరాబాద్‌ను నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. అనూహ్యంగా అక్కడ పాడి కౌశిక్‌రెడ్డికి ప్రజలు పట్టం గట్టారు. అంతర్గత విభేదాలతోనే రాష్ట్రంలో పార్టీని భ్రష్టు పట్టించారని అమిత్‌ షా, మోదీ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇవన్నింటిని సవరించుకొని పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అమిత్‌ షా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వ్యూహ రచనలను సైతం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. మళ్లీ బండి సంజరుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందో లేదో వేచి చూడాలి.

ఉరేసుకుని తల్లీకూతుళ్ల ఆత్మహత్య

 

కరెంట్‌ బిల్లులు కట్టొద్దు : ఎమ్మెల్సీ కవిత

 

About Dc Telugu

Check Also

21.11.2024 D.C Telugu Morning News

21.11.2024 D.C Telugu Cinema News

Viral Video

Viral Video” ఒక‌రిని చూసి మ‌రొక‌రు.. కింద‌వ‌డి న‌వ్వుల‌పాలు వీడియో వైర‌ల్

Viral Video” తోటి వ్య‌క్తి తొడ కోసుకుంటే మ‌నం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత‌.. అచ్చం అలాగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com