Lingapur” శంకరపట్నం డీసీ ప్రతినిధి:
తమ వ్యవసాయ భూములకెళ్లే మార్గం బురదగా మారి, ప్రయాణం ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో లింగాపూర్ గ్రామ రైతులు సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు చేయించుకున్నారు.
️ వర్షాలు పడితేనే మార్గం నరకం!
శంకరపట్నంలోని లింగాపూర్ – హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట మధ్య మట్టి రోడ్ వర్షాకాలంలో పూర్తిగా ధ్వంసమవుతోంది. లింగాపూర్‌కు చెందిన సుమారు 400 ఎకరాల భూములు ఈ మార్గంలో ఉన్నాయి. పోతిరెడ్డి పేట గ్రామానికి రవాణా, వ్యవసాయ పనుల నిమిత్తం రోజూ ఈ మార్గాన్ని అనేకమంది రైతులు, ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు.
అయితే గత ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డుకు తారు రోడ్డు వేయాలని రైతులు అధికారులను కోరుతున్నామని వాపోయారు.
️ రైతుల విజ్ఞప్తి – బీట్ రోడ్డు కావాలి
రైతులు కోరిన విధంగా, ఈ మార్గాన్ని ప్రభుత్వం బీట్ రోడ్డుగా గుర్తించి, శాశ్వత పరిష్కారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.
