Game addiction” ఆన్‌లైన్ ‘కొరియన్’ మాయలో పసి ప్రాణాలు: 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆ*త్మ*హ*త్య

లక్నో/ఘజియాబాద్: స్మార్ట్‌ఫోన్ వ్యసనం, ఆన్‌లైన్ గేమ్‌ల మాయాజాలం మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఆన్‌లైన్ గేమ్ మరియు కొరియన్ సంస్కృతికి బానిసలై, తమ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఘటన వివరాలు:

  • మృతులు: నిషిక (16), ప్రాచి (14), పాఖి (12). వీరు ముగ్గురూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అన్యోన్యంగా ఉండేవారు.

  • కారణం: కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం మొబైల్ వాడటం మొదలుపెట్టిన వీరు, క్రమంగా ‘కొరియన్ లవ్ గేమ్’ వంటి టాస్క్ ఆధారిత గేమ్‌లకు, కొరియన్ డ్రామాలకు బానిసలయ్యారు. తమను తాము కొరియన్లుగా భావించుకుంటూ పేర్లు కూడా మార్చుకున్నారు.

  • పెరిగిన దూరం: గేమ్‌ల పిచ్చితో స్కూలుకు వెళ్లడం మానేశారు. దీనిపై తల్లిదండ్రులు మందలించి, మొబైల్ ఫోన్లు లాక్కోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొరియన్ సంస్కృతికి దూరమై జీవించలేమని భావించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

8 పేజీల సూసైడ్ నోట్:

పోలీసులు వారి గదిని తనిఖీ చేయగా 8 పేజీల డైరీ (సూసైడ్ నోట్) లభ్యమైంది. అందులో “క్షమించు నాన్న.. కొరియా మా జీవితం, దానిని వదిలి మేము ఉండలేము” అని రాసి ఉంది. ముగ్గురూ కలిసి ఒకరి తర్వాత ఒకరు కిటికీ నుంచి కిందకు దూకడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *