Constable Jobs” సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పదోతరగతితోనే కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. పోస్టుల సంఖ్య, జీతం, దరఖాస్తు ఫీజుల ఇతర అర్హతలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో (సీఐఎస్ ఎఫ్)లో కాన్స్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు భారతీయ పౌరులు (స్త్రీలు, పురుషుల) అయి ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య 1161
లకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో నే స్వీకరిస్తారు.
జీతం 21,700 నుంచి 69100 వరకు ఉంటుందని పేర్కొంది .
చదవు అర్హత పదోతరగతి..
10వ తరగతి/మెట్రిక్యులేషన్ఉత్తీర్ణతకు సమానంగా ఉండే ఏదైనా అర్హత (భారతప్రభుత్వంచే గుర్తించిబడిన సంస్థ )
శారీరక సామర్థ్య పరీక్ష (PET) / శారీరక ప్రమాణాల పరీక్ష (PST) /
డాక్యుమెంటేషన్ / ట్రేడ్ టెస్ట్ / రాత పరీక్ష / వైద్య పరీక్షషెడ్యూల్ చేసి నిర్వహిస్తారు.
శారీరక పరీక్ష (PET), శారీరక ప్రమాణాల పరీక్ష (PST), మెడికల్ ఎగ్జామినేషన్ మరియు ఈ నోటిఫికేషన్లో నిర్దేశించిన ఇతర షరతులకు లోబడి ఉంటుంది.
శారీరక ప్రమాణాలు
పురుష అభ్యర్థులకు
a) ఎత్తు (పేరా నం.6.3.1లో పేర్కొన్న వారు తప్ప అన్ రిజర్వ్డ్ ఎస్సీ, ఈడబ్ల్యూ ఎస్ మరియు ఓబీసీ (UR, SC, EWS మరియు OBC) అభ్యర్థులకు) – 170 సెం.మీల ఎత్తు ఉండాలని సూచించారు.
b) ఛాతీ (పేరా నం.6.3.1లో పేర్కొన్న వారు తప్ప అన్ రిజర్వ్డ్ ఎస్సీ, ఈడబ్ల్యూ ఎస్ మరియు ఓబీసీ ( UR, SC, EWS మరియు OBC అభ్యర్థులకు) – 80-85 సెం.మీ (కనీస విస్తరణ 5 సెం.మీ.)
పేరా నం.6.3.1ని అధికార సీఐఎస్ ఎఫ్ వెబైసైట్లో చూడండి. .
మహిళా అభ్యర్థులు :-
a) ఎత్తు (పేరా నం.6.3.1 లో పేర్కొన్న వారు తప్ప అన్ రిజర్వ్డ్ ఎస్సీ, ఈడబ్ల్యూ ఎస్ మరియు ఓబీసీ (UR, SC, EWS మరియు OBC అభ్యర్థులకు) – 157 సెం.మీ.ల ఎత్తు ఉండాలని సూచించారు.
b) ఛాతీ – మహిళా అభ్యర్థుల విషయంలో కనీస ఛాతీ అవసరం లేదు.
వయోపరిమితి
01/08/2025 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య అభ్యర్థులు
02/08/2002 కంటే ముందు మరియు 01/08/2007 కంటే తరువాత జన్మించి ఉండకూడదని పేర్కొన్నారు. .
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష వివరాలు..
ఫీజు ..
UR, అన్ రిజర్వ్డ్ (OBC) మరియు ఈడబ్ల్యూ ఎస్ (EWS) అభ్యర్థుల నుండి రూ.100/- దరఖాస్తు రుసుము వసూలు చేయబడుతుంది.
మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్ తెగ (ఎస్టీ) మరియు మాజీ సైనికుల వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయించబడ్డారు. ( ఫీజులేదు)
రిక్రూట్మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 05-03-2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 03-04-2025
(OMR ) ఓఎంఆర్ ఆధారిత / కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో రాత పరీక్ష ఉంటుంది.
ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మాత్రమే రాత పరీక్ష నిర్వహించబడుతుంది.
అభ్యర్థుల రాత పరీక్షలో వారి అర్హత ఆధారంగా తుది ఫలితం ప్రకటించబడుతుందని సీఐఎస్ ఎఫ్ పేర్కొంది.
దరఖాస్తులను (CISF) సీఐఎస్ ఎఫ్‌లో అధికారిక వెబ్సైట్ అయిన
లింక్‌ను క్లిక్ చేయండి.. https://cisfrectt.cisf.gov.in లో ఆన్లైన్ మోడ్‌లో సమర్పించాలి. . దరఖాస్తును సమర్పించడానికి ఇతర మార్గాలు ఏవీ అనుమతించబడవని తెలిపింది.
డీసీతెలుగువారు.. అధికారిక నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన విషయాలను మాత్రమే అభ్యర్థుల దృష్టికి తీసుకొచ్చాం. పూర్తి వివరాలు అఫిషియల్ నోటిఫికేషన్లోకి పూర్తిగా చదివి అర్థం చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.
అఫిషియల్ వెబ్ సైట్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://cisfrectt.cisf.gov.in/

boAt Ultima Prime & Ultima Ember
⚡ Special Price Rs 1,899
– AMOLED Display
బోట్ స్మార్ట్ వాచ్ వివరాలు పరిశీలించేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి..
బోట్ స్మార్ట్ వాచ్ వివరాలు పరిశీలించేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి.. blinks.to/LB7Ec5J
ఇవి కూడా చదవండి
Chhaava Telugu” తెలుగులో చావా విడుదల.. ఏ రోజున అంటే..?
TS Government Jobs” అంగన్వాడీల్లో టీచర్లు, హెల్పర్ల కొలువుల జాతర.. ఇంటర్ అర్హత..
Bank Jobs” బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 పోస్టుల భర్తీ.. ఏదైనా డిగ్రీతో…
