Thursday , 5 December 2024

చంద్రమోన్ ఎక్క‌డ పుట్టారు..? ఎప్పుడు ఇండస్ట్రీలోకి వ‌చ్చారు..?

సీనియ‌ర్ సినీ న‌టుడు చంద్ర‌మోహ‌న్ శ‌నివారం ఉద‌యం మ‌ర‌ణించారు. ఆయ‌న ఎప్పుడు సినిమాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న సొంత ఊరు అన్ని ఒక్క ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం. చంద్ర‌మోహ‌న్ అస‌లు పేరు మ‌ల్లంప‌ల్లి చంద్ర‌శేఖ‌ర్‌రావు. ఆయ‌న కృష్ణ జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1మే 23 1945న జ‌న్మించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఏంట్రీ ఇచ్చారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 200 పైగా సినిమాల్లో హీరోగా న‌టించారు. న‌టుడిగా 900 పైగా చిత్రాలు కంప్లీట్ చేసుకున్నారు. అన్ని సినిమాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. హీరోగా, క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ర‌కాలు టాలీవుడ్‌లో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆయ‌న హీరోగా న‌టించిన సినిమాలు హిట్టు కొట్టాయి. అప్పుడ‌ప్పుడే కొత్త‌గా రంగ ప్ర‌వేశం చేసిన జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవిల స‌ర‌స‌న హీరోగా న‌టించారు. చంద్రమోహ‌న్ త‌న‌దైన శైలిలో న‌టించి సిరిసిరి మువ్వ సినిమాలో మంచి గుర్తింపు పొందాడు. 2005లో అత‌నొక్క‌డే సినిమాలో చంద్రమోహ‌న్‌కు ఉత్త‌మ క్యారెక్ట‌ర్ న‌టుడిగా, సినిమాకు నంది అవార్డు వ‌చ్చింది. తెలుగు బుక్ ఆఫ్‌ది రికార్డ్‌లో 2021 సంవ‌త్స‌రంలో ఆయ‌నకు చోటు ద‌క్కింది. దివంగ‌త న‌టుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ర‌ఘుప‌తి వెంక‌య్య ఆవార్డును చంద్ర‌మోహ‌న్ అందుకున్నారు. ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా 2000 సంవ‌త్స‌రంలో గుర్తింపు పొందాడు.

చంద్ర‌మోహ‌న్ హిట్ మూవీస్
రంగుల రాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న అదే సినిమా మంచి హిట్టు కొట్టింది. ఆత్మీయులు, బంగారు పిచ్చుక‌న‌, అనే రెండు మూవీల్లో మంచి న‌ట‌న బ‌య‌ట‌కొచ్చింది. బొమ్మ బొరుసు, రామాల‌యం, లాల్‌ప‌త్త‌ర్‌, య‌శోద కృష్ణ సినిమాల్లో త‌న న‌ట‌ను ప్రేక్ష‌కుల‌కు చూపెట్టాడు. య‌శోద కృష్ణ మూవీ ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది. శ్రీ‌దేవి, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, వాణిశ్రీ‌, విజ‌య‌శాంతి లాంటీ హీరోయిన్లు చంద్ర‌మోహ‌న్ తో న‌టించారు. 50 ఏండ్ల పాటు సాగిన సినీ ప్ర‌స్తానంలో రెండు ఫిలింఫేర్ అవార్డులు, 6 నంది అవార్డులు సొంత చేసుకున్నారు. స్టార్ హీరోల‌తోనూ ఆయ‌న న‌టించారు.

కింది లింక్‌ల‌ను క్లిక్ చేసి ఈ వార్త‌ల‌ను కూడా చ‌ద‌వండి

ప్ర‌ముఖ యాక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్ క‌న్నుమూత

ఆస్తికోసం సొంత బిడ్డ‌పైనే గొడ్డ‌ళ్ల‌తో దాడి.. స‌హ‌క‌రించిన కొడుకులు

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు మృతి

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com