ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు మృతి

ఆగి ఉన్న బ‌స్సును ఒక ట్ర‌క్కు అతివేగంగా ఢీకొన‌డంతో ఆరుగురు ప్ర‌యాణికులు మృతి చెందారు. ఇంకో 25 మందికి గాయ‌ప‌డ్డారు. ఈఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గోర‌ఖ్ పూర్ జిల్లాలోని కుషిన‌గ‌ర్ ర‌హ‌దారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. గోర‌ఖ్‌పూర్ నుంచి ప‌ద్రౌనాకు వెళ్తున్న ఓ బ‌స్సు 30 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌దీష్పూర్‌లోని మ‌ల్లాపూర్ ద‌గ్గ‌ర్లో బ‌స్సు టైరుపేలిపోయింది. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్ రోడ్డు ప్ర‌క్క‌న నిలిపివేశాడు. రాత్రి స‌మ‌యం కావ‌డంతో వారంతా మ‌రో బ‌స్సు కోసం ఎదురు చూస్తున్నారు. బ‌స్సు నిలిపి ఉండ‌డంతో కొంత‌మంది బ‌స్సు దిగారు. మ‌రికొంత మంది అందులోనే ఉన్నారు. వేగంగా వ‌చ్చిన ఓ ట్ర‌క్కు ఆ బస్సును ఢీ కొట్టింది. దీంతో అందులో ని ప్ర‌యాణికులు మృతి చెందారు. 25 మంది గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ద‌వాఖానాకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఇవికూడా చ‌దవండి

ఘోర రోడ్డు ప్ర‌మాదం..త‌ల్లి ఇద్ద‌రు పిల్ల‌లు మృతి

అమెరికాలో క‌త్తిపోట్లు.. ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

పువ్వులేవీ..? ప్రియాంక గాంధీ.. బొకే చూసిన న‌వ్విన వైనం వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *