బోనుకు చిక్కిందన్న టిటిడి అధికారులు
అలిపిరి కాలినడక మార్గంలో బోనులో మరో చిరుత చిక్కింది. ఏడో మైలు వద్ద ఆదివారం 7 గంటల ప్రాంతంలో చిరుత చిక్కినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. కాగా ఈ చిరుతతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు నాలుగు చిరుతలను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. జూన్ 22వ తేదీన 7వ మైల్ వద్ద కౌశిక్‌పై దాడి తరువాత చిరుతలను అటవీ అధికారులు బంధిస్తున్నారు. జూన్ 23వ తేదీ రాత్రి 7వ మైల్‌కు సవిూపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతను అటవీ అధికారులు బంధించారు. ఆగష్టు 11వ తేదీన అలిపిరి కాలిబాట మార్గంలోని నరసింహస్వామి ఆలయానికి సవిూపంలో అరేళ్ళ బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. బాలికపై దాడి జరిగిన ప్రాంతానికి సవిూపంలోనే ఆగష్టు 14, 17వ తేదీల్లో రెండు చిరుతలు బోన్‌లో చిక్కాయి.
7వ మైల్ వద్ద మరో చిరుత సంచరించిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. చిరుతను బంధించేందుకు 10 రోజులుగా శ్రమించారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయం చిరుత బోన్‌లో చిక్కింది. అలాగే నడకమార్గంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు యత్నిస్తున్నారు. 15రోజులుగా ప్రయత్నిస్తున్న ఎలుగుబంటి చిక్కడంలేదు
Check Also
Smartwatches” బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లపై డీల్స్ అతి తక్కువ ధరలో
Smartwatches” ⌚ నాయిస్ ట్విస్ట్ ⚡ రూ. 4,999 | రూ. 1,429 – 1.38″ TFT డిస్ప్లే – …