శభాష్ తాండూర్ పోలీస్

పోలీసులు వారిలో ఉన్న మాన‌వ‌త్వాన్ని నిత్యం చాటు కుంటూనే ఉంటారు. శాంతిభ‌ద్ర‌త‌లే కాదు.. ఆప‌ద‌లో ఉన్నా.. ఆక‌లితో అల‌మ‌టించినా పోలీసులు మేమున్నా అంటూ ముందుకొస్తారు. అలాంటి ఘ‌ట‌నే తాండూర్ లో చోటు చేసుకుంది. తాండూర్ మండలంలోని బోయపల్లి బోర్డు వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హైవే రోడ్డు పై నగ్నంగా తిరుగుతున్నాడని స్థానికులు 100కు డయల్ చేసి విషయం చెప్పారు. దీంతో తాండూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్,సంతోష్.. ఘటన స్థలానికి చేరుకొని వారి సొంత ఖర్చులతో బ‌ట్ట‌లు కొనుగోలు చేసి ఆ వ్య‌క్తి కి ద‌రింప‌చేశారు.

తిరుమలలో పట్టుబడ్డమరో చిరుత

అనంత‌రం భోజ‌నం చేయించారు. అతని వివరాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా అత‌డు స్పందించ లేదు. తాండూర్ పోలీసులకు అక్క‌డి పోలీసులు అభినంద‌న‌లు తెలిపారు. ప్రజలు తమకు సమస్య వస్తే 100 నెంబర్ కు డయల్ చేయాలని అందుబాటులో ఉన్న పోలీసులు క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుంటారన్నారు.

చ‌ద‌వండి ఇవి కూడా..

చంద్రుడిని హిందూరాజ్యంగా ప్రకటించాలి

త‌ల కిందులుగా వేలాడ‌దీసి దాడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *