119 నియోజకవర్గాలకు
వెయ్యికి పైగా దరఖాస్తులు
కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీకీ తెలంగాణాలో కొత్త ఊపు వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తో పాటు కాంగ్రెస్ నాయకులు ఘంటా పదంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే ఆశావహులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో భారీ స్థాయిలో ఆశావహులు అప్లికేషన్ చేసుకున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న విబేధాలు పోయేందుకు దష్టిసారించలేదన్న విమర్శలూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉండడం, పోటీ అధికం కావడంతో టికెట్ కోసం భారీ సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. 119 నియోజక వర్గాలకు 1006 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులపై పీసీసీ ఎన్నికల కమిటీ వడపోసి రెండు మూడు క్యాటగీరిల్లో స్క్రీనింగ్ కమిటీకీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ క్రమంలో తమకంటే తమకే టికెట్ వస్తుందంటూ నియోజక వర్గాల్లో నాయకులు హడావుడి చేస్తున్నారు. పోటా పోటీగా ప్రదర్శనలు చేస్తుండడంతో కొన్ని నియోజక వర్గాల్లో నాయకుల మధ్య పోటీ ఘర్షణకు దారితీస్తున్నాయి.
భారీగా దరఖాస్తులు…
