ఆస్తి వివాదంలో మహిళా లాయర్ ను ఆమె భర్తే చంపి 36 గంటలు అదే బంగ్లాలో దాక్కున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల రంగంలో కి దిగండంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మహిళా లాయర్ రేణు సిన్హా (61) ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హాతో కలిసి నోయిడా సెక్టార్ 30లోని వారి బంగ్లాలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు విదేశాల్లో ఉండగా దంపతులిద్దరూ అక్కడే కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఆమె సుప్రీంకోర్టు న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో న్యాయవాది రేణు సిన్హా తాజాగా దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మతదేహం వారి బంగ్లాలోని బాత్రూమ్లో శనివారం లభ్యమైంది. మరోవైపు ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హా గత రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని ఫోన్ కాల్స్ ట్రాక్ చేసి ఈ రోజు అరెస్ట్ చేశారు. గత రెండు రోజులుగా నితిన్ నాథ్ సిన్హా బంగ్లా స్టోర్ రూమ్‌లోనే దాక్కున్నట్లు సమాచారం. గడచిన రెండు రోజులుగా న్యాయవాది రేణు సిన్హా సోదరుడు ఆమెకు ఫోన్ కాల్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రేణు సిన్హా నివాసం ఉంటోన్న బంగ్లా వద్దకు చేరుకుని సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బాత్రూంలో ఆమె మతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె భర్త కనిపించకుండా పోవడంతో న్యాయవాది రేణు సిన్హా భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని సోదరుడు ఆరోపించాడు. ఈ దారుణ ఘటన శనివారం (సెప్టెంబర్ 9) వెలుగు చూసింది.మతురాలి భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పోలీసులు సిన్హా ఫోన్‌ను ట్రాక్ చేయగా వారు నివాసం ఉంటోన్న బంగ్లాను చూపింది. పోలీసులు మరోమారు బంగ్లా మొత్తం వెదకగా స్టోర్ రూమ్‌లో దాక్కున్న నితిన్ నాథ్ సిన్హాను గుర్తించి అరెస్ట్ చేశారు. తమ బంగ్లాను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలే న్యాయవాది హత్యకు దారితీనట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. న్యాయవాది రేణు సిన్హా తాను నివాసం ఉంటోన్న బంగ్లాను విక్రయించాలని భావించారు. దీనిలో భాగంగా కొనుగోలుదారు నుంచి నగదును కూడా తీసుకున్నారు. అయితే బంగ్లాను అమ్మడం ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హాకు ఇష్టం లేదు. ఈ వ్యవహారం దంపతుల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, అందువల్లనే భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.