Current Affairs” సంతోష‌క‌ర‌మైన దేశాల జాబితా… పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం..

Current Affairs”  ప్ర‌పంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఈ దేశం వరుసగా ఎనిమిదోసారి కూడా మొద‌టి స్థానంలో నిల‌వ‌డం విశేషం.
మ‌న దేశం విష‌యానికొస్తే తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకొని 118వ ప్లేస్‌కు చేరుకుంది.
యూఎన్‌వో అంతర్జాతీయ ఆనంద దినోత్సవం పుర‌స్క‌రించుకుని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ వారు ఈ నివేదిక‌ను విడుద‌ల చేశారు.
వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్”వరల్డ్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్ 2025″ను గురువారం విడుదల చేసింది.
ప‌లు దేశాల్లోని ప్రజల ఫీడ్బ్యాక్ తో ఈ రిపోర్ట్‌ను త‌యారు చేశారు.
అవినీతి, సోషల్ సపోర్ట్, స్వేచ్ఛ, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరోగ్యం, ఔదార్యం, వంటి అంశాలతో స‌ర్వే చేశారు. ఇందులో జీరో నుంచి ప‌ది పాయింట్లు వ‌ర‌కు కేటాయించారు.
ఈ స‌ర్వేలో 140 దేశాలకు ర్యాంకులు కేటాయించారు. అయితే ఫిన్లాండ్ కంట్రీ 7.74 సగటుతో మొద‌టి స్థానంలో నిలిచింది.
అమెరికా ఈ సారి 24వ స్థానంలోకి దిగ‌జారిది. 23వ స్థానంలో బ్రిటన్ ఉంది. ఈ లిస్ట్‌లో ఆఫ్గానిస్తాన్ చిట్టచివరన ఉంది.
చివరి నుంచి రెండో, మూడో స్థానంలో సియెర్రా లియోన్, లెబనాన్ ఉన్నాయి.
భార‌త్ సంతోష‌క‌ర‌మైన దేశాల జాబితాలో తన ర్యాంకును కొద్దిగా మెరుగుపరుచుకుంది.
2024లో 126వ స్థానంలో ఉంది. ఈ ఏడాది 118కి ఎగబాకింది.

టాప్ 10 హ్యాపీయెస్ట్ దేశాలను పరిశీలిస్తే
ఒక‌టో స్థానంలో ఫిన్లాండ్,
రెండో స్థాన‌లో డెన్మార్క్,
మూడో స్తానంలో ఐస్లాండ్,
నాలుగో స్థానంలో స్వీడన్,
ఐదో స్థానంలో నెదర్లాండ్స్,
ఆరో స్థానంలో కోస్టారికా,
ఏడో స్థానంలో నార్వే,
8వ స్థానంలో ఇజ్రాయిల్‌,
9వ స్థానంలో లక్సెంబర్గ్,
10 వ‌స్థానంలో మెక్సికో నిలిచాయి.

మ‌న పొరుగున ఉన్న చైనా 68వ స్థానంలో నిలిచింది.
92వ స్థానంలోనేపాల్ ,109వ స్థానంలో పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి.
133వ స్థానంలోశ్రీలంక , 134వ స్థానంలో బంగ్లాదేశ్ లు నిలిచాయి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *