సాధారణంగా గర్భం దాల్చిన మహిళలకు శ్రీమంతం చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ ఫ్యామిలీ కుక్కకు శ్రీమంతం చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే. గొల్డెడన్ రీట్రివర్ కుక్కకు దాని ఓనర్లుసిద్ధార్థ్ శివమ్ కుటుంబం శ్రీమంతం ఫంక్షన్ చేశారు. వాళ్లు పెంచుకునే కుక్క రోజీ ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రసవానికి కూడా టైం దగ్గరపడడంతో వారు శ్రీమంతం చేయాలని భావించారు. ముందుగా కుక్క నుదుటన బొట్టు పెట్టారు. అనంతరం గాజులు తొడిగార. దాని మీద పూలు చల్లడంతో పాటు స్వీట్లు తినిపించారు. ఇంతటితో ఆగకుండా ఆ కుక్కకు పట్టు చీర కూడా చుట్టడం విశేషం. ఆ కుక్క ముందు ఐయామ్ రెడీ అంటూ బోర్డు కూడా పెట్టడం విశేషం
View this post on Instagram
ఇవి కూడా చదవండి