Karimnagar News” రైతుల వ్యవసాయ తో పాటుగా పాడి పశువుల పెంపక పై దృష్టి సారించాలని మండల పశువైద్యులు మనొహర్ సూచించారు.
కరీంనగర్ పశుగణాభివృద్ధి సంస్థ సూపర్వైజర్ రాఘవ ఆధ్వర్యంలో గుడివేలుగులపల్లి గ్రామం లో మంగళవారం కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు దూడల పెంపకంపై అవగాహన కల్పించారు. నట్టలనివారణ మందులను, మినరల్ మిక్చర్ పౌడర్ ను అందించారు. గోపాలమిత్ర ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడ దూడలు జన్మించే వీర్యం అందుబాటులోకి వచ్చిందిన్నారు. దీని విలువ 600 రూపాయలు ఉంటుందని ప్రభుత్వ రాయితీపై రైతులకు 250 రూపాయలకే అందిస్తున్నామని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు 34 కృత్రిమ గర్భధారణ 4, దూడల నట్ట నివారణ మందులు 40 తాగించారు.ఈ కార్యక్రమంలో గోపాలమిత్రులు ఆంజనేయులు, పశుసంవర్ధక శాఖ ఆఫీస్ సిబ్బంది , రఘు , శ్రీనివాస్ ,గణేష్,పాడి రైతులు పాల్గొన్నారు.
దూడలకు నట్టల మందు వేస్తున్న గోపాల మిత్రులు ఆంజనేయులు
ఇవి కూడా చదవండి
Viral Video” బైక్ ఏజెన్సీలోకి చొరబడిన ఎద్దు.. ఎర్ర షర్ట్ వేసుకున్న వ్యక్తిని పై.. వీడియో వైరల్
Tata AIA” టాటా ఏఐఏ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంః భరోసా, భద్రతతో ఆర్థిక భవిష్యత్తు
Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంతలోనే ఘోర ప్రమాదం..
Viral Video” నీళ్లలో తేలుతున్న బాడీ.. ఊరి వచ్చేసరికి.. వైరల్ వీడియో
Home decor” ఇల్లు లేదా ఆఫీస్ కోసం డెకరేషన్ బొమ్మలు
Kanpur News” ఫోల్‌పైనే కరెంట్ షాక్.. వీడియో.
Bmtc Bus” డ్రైవర్ కు గుండెపోటు.. ప్రయాణికులను కాపాడిన కండక్టర్ .. వీడియో
Sea Plane” నీటి విమానం.. రేపే ప్రారంభం.. ట్రయిల్ రన్ వీడియో..