హైదరాబాద్‌లో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని బజార్ ఘాట్‌లోని ఓ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. అవి ఐదు అంతస్తులకు వ్యాపించాయి.. ఈ ఘటనలో 9 మృది మృతి చెందారు. కొందరు ఊపిరాడక మృతి చెందినట్టు సమాచారం. మరికొందరు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. నాలుగు రోజుల పసిబిడ్డ ఉండడం కలిచివేస్తోంది. మృతి చెందిన వారిలో ఒక్క కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. అపార్ట్‌మెంట్ ఎదుట పార్క్ చేసి ఉన్న ఒక కారు, ఆరు బైక్‌లు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్ వద్ద కు వెళ్లి రెస్కూ ఆపరేషన్ చేశారు. నాలుగు ఫైర్ ఇంజిన్‌ల తో మంటలను ఆర్పారు. అందులో చిక్కుకున్న 21 మందిని రెస్కూ సిబ్బంది ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఎనిమిది మంది గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ గ్యారేజీ ఉన్నదని, అందులో కారును మరమ్మతులు చేస్తుడగా మంటలు చెలరేగాయని సెంట్రల్ జోన్ డీసీ వెంకటేశ్వర్‌రావు చెప్పారు. అపార్ట్ మెంట్ ఓనర్ రమేశ్ జైశ్వాల్ ప్లాస్టిక్ ను తయారు చేసే కెమికల్ డ్రమ్ములను గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలువ చేశారు. ఈ డ్రమ్ములకు మంటలు అంటుకోని పెద్ద ఎత్తున చెలరేగాయి. అపార్ట్ మెంట్ ఓనర్ రమేశ్ జైశ్వాల్ పరారయ్యాడు.
ఏందన్నా ఇది.. టపాకాయలు అమ్మడానికా..? పేల్చడానికా…? బండ్ల గణేశ్ వాకింట్లో బాంబులే బాంబులు
తల్లి కండ్ల ముందే పిల్లలు మృతి మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆస్తికోసం సొంత బిడ్డపైనే గొడ్డళ్లతో దాడి.. సహకరించిన కొడుకులు