పండుగ పూట మెదక్ విషాదం చోటు చేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాంబులు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా స్కూటిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి కండ్ల ముందే పిల్లలు మృతి చెందారు. ఈ ఘోర ఘటన మెదక్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హోంగార్డు శ్రీనివాస్ ఆయన భార్య అన్నపూర్ణ మెదక్ పట్టణంలో నివాసులు. వీరికి ఇద్దరు పిల్లలు. హోంగార్డు గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ రెండేండ్ల కింద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అన్నపూర్ణ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను సాదుకుంటోంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా టపాసులు కొనుక్కుందుకు బయటకు స్కూటీపై వెళ్లారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వీరి స్కూటిని ఢీకొట్టింది. ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విమానం కారు ఢీ వీడియో మీరు చూడండి
ఆస్తికోసం సొంత బిడ్డపైనే గొడ్డళ్లతో దాడి.. సహకరించిన కొడుకులు