గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు వస్తుంన్నాయంటూ వ్యక్తి ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన గ్రామానికి చెందిన పల్లె శేఖర్ అనే వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు. గ్యాస్ కంపెనీవారు సిలిండర్ డిలివర్ చేసిన వెళ్లిన తరువాత వంట చేసేందుకు స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించగా వెలగలేదని వాపోయాడు. సిలిండర్ ఊపి చూడగా నీళ్లు ఉన్నట్లు శబ్దం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్ తీసుకొచ్చి వారి ముందే నీళ్లు వస్తుండటాన్ని చూపించగా మరో సిలిండర్ ఇచ్చి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగు స్క్రైబ్ వారు ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు!
రంగారెడ్డి – మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన పల్లె శేఖర్ అనే వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేయగా వంట చేసేందుకు స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించగా వెలగలేదు. సిలిండర్ ఊపి చూడగా నీళ్లు ఉన్నట్లు శబ్దం వచ్చింది.
ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్… pic.twitter.com/BDff8sPaFE
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2024
పేదింటి బిడ్డ మా ఊరి మహాలక్ష్మి అండ
ఆహారం పెట్టిన పిల్లవాడు.. బుడ్డోడిని పైకి లేపిన జీరాఫి.. వీడియో వైరల్