Ts Rtc” తమ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను మోసం చేసిన కేసులో ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కావాడాన్ని #TSRTC యాజమాన్యం స్వాగతిస్తోందని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటనను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డిలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్ లో టీఎస్ఆర్టీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. ఆరు సంవత్సరాలకు గాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుందని ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదు. హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు బకాయిలున్నాఎక్స్ ఖాతా లో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులను ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేసింది.
తమ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను మోసం చేసిన కేసులో ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కావాడాన్ని #TSRTC యాజమాన్యం స్వాగతిస్తోంది. ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.… pic.twitter.com/79cpGAXT40
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) February 3, 2024
ఇవి కూడా చదవండి
Gas Cyleder” గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు.. వ్యక్తి ఆందోళన
ఆహారం పెట్టిన పిల్లవాడు.. బుడ్డోడిని పైకి లేపిన జీరాఫి.. వీడియో వైరల్