తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ప్రవేశ పెట్టిన పథకం మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు టీ ఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఓ ప్రవేశ పరీక్షలో వచ్చిన ప్రశ్నను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దీనికి మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!? అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించే పథకం గురించి కింది వాటిల ఏవి సరైనవి కావు. ..? అనే ప్రశ్నకు నాలుగు సమాధానాలు కూడా ఇచ్చారు. దీనిపై సరైన సమాధానం చెప్పాలని ట్వీట్ చేశారు.
ఇటీవల నిర్వహించిన ఓ ప్రవేశ పరీక్షలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకంపై వచ్చిన ప్రశ్న ఇది.
మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!?@PonnamLoksabha@PROTSRTC @TSRTCHQ pic.twitter.com/rZyUYXyTbB
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 11, 2024
ఇవి కూడా చదవండి
Ts Rtc Electric buses” 25 ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు ప్రారంభం
Indiramma House Scheme” ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం.. నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లంటే..
Fire Accident In Bus ” మంటల్లో చిక్కుకున్న పెండ్లి బస్సు.. 10 దుర్మరణం