Graameena Vikaasam” శంకరపట్నం (డిసీ ప్రతినిధి):
గ్రామీణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఆయన నేతృత్వంలో “గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యం” అనే కరపత్రాన్ని విడుదల చేసి, ప్రజల్లో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసగించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్‌ఎస్ ఆరాచక పాలనకు కొనసాగింపుగా మారిందని తెలిపారు. నెరవేర్చని హామీలు, అవినీతిపరమైన పాలన, ఆర్థిక అసమర్థత, పేదల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలు ఇప్పటికీ రాష్ట్రాన్ని వేధిస్తున్నాయని అన్నారు.
ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అవినీతిపై ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, ఇనకొండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ్రీడమ్ సేల్ స్పెషల్ – ఫ్యాషన్ ఫుల్ ఆఫర్!
70% డిస్కౌంట్ తో 5 టి-షర్ట్స్ కేవలం ₹549 కి!
ఒక్కో షర్ట్ ₹109.80 మాత్రమే!
స్టయిలిష్ ప్రింటెడ్ డిజైన్లు
పిల్లలకే కాదు – స్టైల్ కి హక్కు అందరికీ!
️ Freedom Sale లో బంపర్ ఆఫర్లు మిస్ అవ్వకండి!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/45eA8Hd లింక్ పై క్లిక్ చేయండి
