హాస్టల్లో ఉండి పోటీపరీక్షలకు చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలని బిక్కాజి పల్లెకు చెందిన మర్రి ప్రవళిక (23) హైదరాబాద్‌లోని ఆశోక్‌నగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హాస్టలో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తరువాత వచ్చిన ఆమె స్నేహితులు పోలీసులు సమాచారమిచ్చారు. గ్రూప్ 2 వాయిదాపడడం వల్లే సూసైడ్ చేసుకుందని తోటి విద్యార్థలు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రూప్ 2 విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సూసైడ్‌లెటర్‌లో ..
నేను నష్ట జాతకురాలిని, ‘అమ్మా నన్ను క్షమించు.. నావల్ల మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. ఏడ్వొద్దు. జాగ్రత్తగా ఉండండి. నా అదృష్టం కొద్ది మీకు కూతురుగా పుట్టాను.. నన్ను కాళ్లు కందకుండా చూసుకున్నారు. కానీ మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్నెవరూ క్షమించరు.. మీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా అమ్మా.. నాన్న జాగ్రత్త’ అంటూ రాసింది.