బందీలుగా ఉన్న పిల్ల‌ల బాగానే చూసుకుంటున్నాం హ‌మాస్ వీడియో విడుద‌ల‌.. మ‌నం ఓడించ‌బోతున్న‌ది వీళ్ల‌నే ఇజ్రాయిల్ కౌంట‌ర్

గ‌త వారం రోజుల క్రితం 5 వేల రాకెట్ల‌తో ఇజ్రాయిల్ పై హ‌మాస్ మిలిటెంట్లు విరుచుక‌ప‌డిన విష‌యం తెలిసిందే. అదే రోజు ఇజ్రాయిల్ నుంచి చిన్నా చిత‌క‌, ఆడ‌, మ‌గ దేశం, విదేశం అనే తేడా లేకుండా మిలిటెంట్లు దొరికివారిని దొరికిన‌ట్టు బందీలుగా పట్టుకుపోయారు. ఈ క్ర‌మంలో వారు చేసిన ప‌నికి యావ‌త్తు ప్ర‌పంచం ఖండించింది. చిన్న‌పిల్ల‌ల‌ను, ఆడ‌వాళ్ల‌ను బందీంచ‌డం పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.
ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 14 శ‌నివారం నాడు హ‌మాస్ మిలిటెంట్లు ఓ విడుద‌ల చేశారు.

బైక్‌పై చేజ్‌.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి
బందీలుగా ఉన్న పిల్ల‌ల‌ను బాగా చూసుకుంటున్నాం. వారి ఆక‌లి తీర్చుతున్నాం అంటూ అందులో పేర్కొన్నారు. ఆ వీడియోలో ఏడుస్తున్న బాలుడిని లాలించ‌డం, మ‌రో బాలుడికి కాలు దెబ్బ‌తగిలితే క‌ట్టు క‌ట్ట‌డం లాంటివి చూడొచ్చు.

అదే వీడియోను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. ఆ వీడియోలో ఉన్న పిల్ల‌ల గాయాల‌ను చూడొచ్చు, వారి కేక‌లు వినండి అని పేర్కొన్నది. ఈ పిల్ల‌ల‌ను హ‌మాస్ ఉగ్ర‌వాదులు వారి సొంత ఇండ్ల‌లో బందీలుగా ఉంచ‌డంతో భ‌యంతో వ‌ణుకుతున్న‌ట్టు అనుభూతి చెందుతార‌ని రాశారు. వారి త‌ల్లిదండ్రులు ప‌క్క గ‌దిలో చనిపోయి ఉన్నారు. మ‌నం ఓడించ బోతున్న ఉగ్ర‌వాదులు వీరేన‌ని పేర్కొ ఐడీఎఫ్ పేర్కొంది.

ఇవి కూడా చ‌ద‌వండి

లారీలో 42 కోట్లు.. బెంగుళూరులో సీజ్

డ‌బ్బుల వివాదం.. అత్తను గ‌న్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

బీఆర్ ఎస్‌లోకి పొన్నాల ల‌క్ష్మ‌య్య ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *