కొందరు మద్యం మత్తులో ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. రక్త సంబధీకులు, స్నేహితులు అనే తేడా లేకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. సిగరెట్ పంచుకోలేదని స్నేహితుడని చూడకుండా దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతుడు రోహిత్, అతని స్నేహితులు జై, సుమిత్ సింగ్‌లతో కలిసి మందు తాగాడు. రోహిత్ సిగరేట్ తాగుతున్నప్పుడు తనకు ఇవ్వాలని జై అడిగిండు. రోహిత్ అతనికి సిగరెట్ ఇవ్వలేదు. దీంతో ఆవేశానికిలోనైన జై, సుమిత్ ఇద్దరు కలిసి కత్తితో పొడిచారు. తీవ్రగాయాలయిన రోహిత్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ దవఖానాలో రోహిత్ మృతి చెందాడు. దాడిచేసిన జై, సుమిత్‌లు అక్కడి నుంచి పారిపోయారు. జై అలియాస్ జితేంద్రను పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
లారీలో 42 కోట్లు.. బెంగుళూరులో సీజ్