అమెరికాలోని ఈశాన్య రాష్ట్రల్లో భారీ వర్షాలు, వరదలతో ఆగమాగమవుతున్నాయి. అమెరికా దేశలో ముఖ్య ట్టణంగా, ఫైనాన్సియల్ రాజధాని విలసిల్లుతున్న న్యూయార్క్ నగరాన్ని వరదలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ క్యాథి హెచుల్ న్యూయర్క్ సిటీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వరద నీరు సబ్‌వేలు, ఎయిర్‌పోర్టుల్లోకి చేరింది. దీంతో తాత్కలికంగా వాటిని క్లోజ్ చేశారు. భీకరంగా కురుస్తున్న వర్షానికి పలు ట్రయిన్లను రద్దు చేశారు. వరద ఉదృతి ఇంకా పెరగనున్నందని ఆదేశ వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ.. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని చెప్పారు. వరదల ధాటికి బ్రూక్లిన్, క్వీన్స్ స్టేట్స్‌లో 13 మంది మరణించారు.