Ts Assembly” ఆటో డ్రైవర్ల పట్ల సర్కారు వైఖరికి నిరసనగా శుక్రవారం నాడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలకు శుక్రవారం ఆటోల్లో వెళ్లారు. హైదర్ గూడాలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో అసెంబ్లీకి తరలి వెళ్లారు. అసెంబ్లీ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని చెప్పారు. వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోని లేని ఆంక్షలు ఇప్పుడెందుకని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఇదేనా ప్రజాపాలన..?
👉గతంలో లేని ఆంక్షలు, నిర్బంధాలు ఇప్పుడెందుకు?
👉అసెంబ్లీకి శాసనసభ్యులు ఆటోలో వెళ్ళకూడదా.?
👉అసెంబ్లీ సాక్షిగా నేడు ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.
👉ప్రజా ప్రభుత్వంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా?
👉22 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే… pic.twitter.com/rmDqrSKsvR
— Harish Rao Thanneeru (@BRSHarish) February 9, 2024
బాలుడి మీదకు దూసుకెళ్లిన వ్యాన్, స్పందించిన ఆర్టీసీ ఎండీ.. వీడియో పోస్టు