Hisar express” ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో (Hisar Express fire) హిసార్ ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. (Tirupati train fire) ఈ రైలు రాజస్థాన్ నుండి తిరుపతికి బయలుదేరినది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు గందరగోళానికి లోనయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది తక్షణమే సహాయ చర్యలు ప్రారంభించారు.
పక్క ట్రాక్ మీదుగా వెళ్తున్న వందే భారత్ రైలు సకాలంలో ఆగడంతో (Railway fire accident) భారీ ప్రమాదం తప్పింది. అగ్నిమాపక దళాలు మంటల్ని ఆర్పేందుకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటన కారణంగా తిరుపతి పరిసరాల్లో రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
మరో రైల్వే ప్రమాదం – తిరువళ్లూర్ సమీపంలో మంటల్లో ముడి చమురు రైలు
ఇలాంటి ఘోరమైన అగ్నిప్రమాదం ఆదివారం తెల్లవారుజామున తిరువళ్లూర్ జిల్లా (Crude oil train fire Egattur) ఎగట్టూర్ వద్ద చోటు చేసుకుంది. ముంబైకి వెళ్తున్న ముడి చమురు రవాణా రైలు (ఫ్రైట్ ట్రైన్)లోని ట్యాంకర్లలో ఒకటి అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆ మంటలు పక్కనున్న ట్యాంకర్లకు వ్యాపించాయి. మొత్తం 45 ట్యాంకర్లు కలిగిన ఈ రైలు, చెన్నైలోని ఎన్నోర్ నుంచి బయలుదేరినది. (Chennai–Arakkonam rail disruption)
పొగలు ఎగసిపడిన దృశ్యాలు స్థానికులను భయపెట్టాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు చెన్నై – అరక్కోణం మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ చర్యల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి లేదా ఆలస్యమయ్యాయి.
ఈ రెండు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంటల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, రెండు చోట్లూ అత్యవసర చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
తిరుపతి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం
రాయలసీమ, షిరిడీ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు
లూప్లైన్లో ఆగివున్న రెండు రైళ్లలో మంటలు
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది pic.twitter.com/AFGIptztXt
— greatandhra (@greatandhranews) July 14, 2025
