School Bus Accident” స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులు మృతి

School Bus Accident"

School Bus Accident” పాఠ‌శాల బ‌స్సు బోల్తాప‌డి ఐదుగురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలోని నార్నాల్‌లో గురువారం చోటు చేసుకుంది. మ‌రో 20 మందికి పైగా విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. పాఠ‌శాల ముగిసిన త‌రువాత స్కూల్ ఇంటికి పిల్ల‌ల‌ను తీసుకెళ్తున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా దేశ‌మంత సెల‌వు ఉండ‌గా ఈ పాఠ‌శాల మాత్రం తెరిచి ఉంచ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఘ‌ట‌న స‌మ‌యంలో 4 త‌ర‌గ‌తి నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సుమారు 35 మంది పిల్ల‌ల వ‌ర‌కు ఉన్న‌ట్టు స‌మ‌చారం. గాయ‌ప‌డ్డ విద్యార్థుల‌ను స‌మీపంలోని ద‌వాఖానాకు త‌ర‌లించారు. ఇందులో ఒక‌రి పరిస్థితి విష‌మంగా ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీస‌లు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌దవండి

Tamilanadu Accident” బైక్‌ను ఢీకొట్టిన కారు.. వీడియో రికార్డు.. ఐదుగురు మృతి

Karimnagar to Mumbai Train” క‌రీంన‌గ‌ర్ టు ముంబై రైలు ప్రారంభం.. వివ‌రాలివే..

Crow Viral Video” కాకి చెప్పిన నీళ్ల క‌థ‌.. పాత‌దే కానీ కొత్త‌గా మ‌ళ్లా… వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *