ఇండియా పేరును భారత్ గా మార్చుతున్నారనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ క్రమంలో పేరు మార్పును అంగీకరించే వారు కొందరైతే ఇండియానే ఉండాలనే వారు మరికొందరు. అసలు దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ఇంత అర్జంటుగా పేరుమార్చాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పేర్లు మార్పు అనేది ఇప్పటి దికాదు ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో దేశాలు, ఎన్నోనగరాలకు పేర్లు మారుతు వచ్చాయి.
కొన్ని దేశాల పేర్లు పరిశీలిద్దాం..
రిపబ్లిక్ ఆప్ మాసిడోనియా : రిపబ్లిక్ ఆప్ మాసిడోనియా అనే దేశం పేరును 2019లో రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియాగా మార్చారు.
ఇరాన్ : ఒకప్పడు పర్షియా గా పేరొందిన దేశాన్ని ఇప్పుడు ఇరాన్ గా మార్చారు.
1935లో పర్షియా పేరును అప్పటి రాజు రెజా షా ఇరాన్‌గా మార్చారు.
శ్రీలంక : ఇండియా పక్కనే ఉన్న శ్రీలంక పేరు కూడా గతంలో మార్చారు. 1972 కు ముందు సిలోన్గా ఉన్న పేరును శ్రీలంకగా మార్చుకొన్నది. బ్రిటిష్ సంస్కృతి నుంచి సంబంధాలు తెచ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. 2011లో ప్రభుత్వ వినియోగం నుంచి అధికారికాంగా వలస రాజ్యాలకు ప్రతీకగా ఉన్న సిలోన్ మొత్తం మొత్తానికే తొలగించింది.
స్వాజిలాండ్: 2018లో ఏప్రిల్‌లో స్వాజిలాండ్ రాజు ఏం స్వాతి -3 స్వాజిలాండ్ పేరును కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతినిగా మార్చారు.
మయన్మార్ : మనకు పొరుగు దేశంగా ఉన్న మయన్మార్ దేశాన్ని గతంలో బర్మా అని పేరు ఉండేది. సైనిక నాయకులు మయన్మార్ దేశంగా పేరు మార్చారు.
తుర్కియే :టర్కి తమ దేశం పేరును 2022లో తుర్కియేగా మార్చుకుంది.
నెదర్లాండ్ : హాలెండ్ పేరును నెదర్లాండ్ గా మార్చుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ఇమేజ్ను పెంచుకునేందుకు తన నెదర్లాండ్గా ప్రకటించింది
చెకియా : తాజాగా చెక్ రిపబ్లిక్ ఈ సంవత్సరమే చెకియా మార్చకున్నది. పలు రకాల వస్తువులపై తమ పేరును ఈజీగా రాసుకునేందుకు ఈ మార్పు చేసినట్టు తెలిపింది.
భారత దేశంలోనూ నగరాలు, రాష్ట్రాల పేర్లు మార్చారు.
బొంబాయిని ముంబాయిగా, మద్రాస్‌ను చెన్నైగా, కొల్కట్టాను కలకత్తాగా, పాండిచ్చేరిని పుదుచ్చేరిగా, ఆంధ్రరాష్ట్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ గా ఒరిస్సాను ఒడిస్సాగా, మైసూర్ ను కర్ణాటక గా మార్చిన విషయం తెలిసిందే.
చదవండి ఇవి కూడా లింక్ ను క్లిక్ చేసి పూర్తి వార్తను చదవండి
మెట్ల మార్గంలో బోనులో చిక్కిన మరో చిరుత
