నడి సముద్రంలో వెళ్తున్న ఓ షిప్‌పై హెలికాప్టర్ ను ల్యాండ్ చేసి హైజాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను హౌతీ రెబల్స్ విడుదల చేశారు. ఈ వీడియో హాలివుడ్ చిత్రాల్లోని యాక్షన్ సీన్లను తలపించేలా ఉంది. ఎర్ర సముద్రంలో వెళ్తున్న సరుకు తరలించే నౌక గెలాక్సీ లీడర్‌ను హౌతీ తిరుగుబాటు దారులు హెలికాప్టర్ తో వెంబడించారు. నౌక వెళ్తున్న క్రమంలో హెలికాప్టర్‌ను దానిపైకి తీసుకెళ్లి డెక్‌పై ల్యాండ్ చేశారు. అందులోంచి బయటకొచ్చిన హౌతీ తిరుగుబాటు దారులు నినాదాలు చేస్తూ గన్‌లు పట్టుకొని పరుగెత్తుతూ షిప్‌లోకి ఎంటర్ అయ్యారు. లోపలికి వెళ్లాక వీల్ హౌస్, కంట్రోల్ సెంటర్‌ను వారి ఆధీనంలోకి తీసుకున్నట్టు ఆ వీడియో లో ఉంది. ఈ షిప్‌ను యెమెన్‌లోని సలీఫ్ తీరానికి తరలించారు. ఇది ఆరంభం మాత్రమేనని, గాజా యుద్దాన్ని ఆపేంత వరకు తిరుగుబాటు దారుల ప్రతినిధి ఒకరు ప్రకటించారు. గాజా పై యుద్దాన్ని ఆపకపోతే ఇజ్రాయిల్‌పై మరిన్ని దాడులు చేస్తామని తిరుగు బాటు దారులు హెచ్చరించారు. ఆ నౌక తమది కాదని ఇజ్రాయెల్ క్లారిటీ ఇచ్చింది. ఈ షిప్ తుర్కియే నుంచి భారత్ కు వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది. నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. వారిని బందీలుగా తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వక్యకతం చేసింది. ఈ షిప్ ఓనర్ బ్రిటన్ వాసిది. కాగా దీనిని జపాన్ చెందిన వారు నిర్వహిస్తున్నారు. దీంతో జపాన్ ప్రభుత్వం బందీలను విడిపించేందుకు రంగంలోకి దిగింది. షిప్‌ను విడిపించాలని ఇరాన్, సౌదీ అరేబియా, ఓమన్ దేశాలను కోరింది.
Yemeni Houthis released footage of capturing an Israeli cargo ship.#Yaman #Hamas #Israel #غزة_الآن #فلسطين_أستراليا #فلسطين_قضية_الشرفاء #فلسطين #إسرائيل pic.twitter.com/z4roGnW64y
— Ali hasnain (@Alihasn55838511) November 22, 2023
ఆటో కాదిది స్కార్పిటో.. వీడియో మీరు చూడండి
ఒకటే కుటుంబంలో అందరికీ ఆరువేళ్లు… ఇప్పటి వరకు 150 మందికి