Icici Bank” న్యూఢిల్లీ, ఆగస్ట్ 9:
ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై కొత్త నిబంధనలు అమలు చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త కస్టమర్లకు ఈ మార్పులు వర్తిస్తున్నాయి. మెట్రో మరియు అర్బన్ ప్రాంతాల్లో కొత్త ఖాతాదారులు కనీసం రూ. 50,000 బ్యాలెన్స్‌ను ఖాతాలో ఉంచాలి. పాత కస్టమర్లకు మాత్రం ఎలాంటి మార్పులు లేవు. మెట్రో, అర్బన్ ఏరియాల్లో వారి కనీస బ్యాలెన్స్ రూ. 10,000గానే కొనసాగుతుంది.
ఇతర ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:
సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొత్త ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ రూ. 25,000
రూరల్ ఏరియాల్లో కొత్త ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ రూ. 10,000
పాత కస్టమర్లకు (రూరల్, సెమీ అర్బన్): రూ. 5,000 బ్యాలెన్స్ కొనసాగుతుంది
బ్యాలెన్స్ ఉంచకపోతే జరిమానా
కనీస బ్యాలెన్స్ ఉంచని ఖాతాదారులు అరుచ్ శాతం (6%) వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని ఇతర మార్గదర్శకాలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి:
సేవింగ్స్ ఖాతాల్లో నెలకు మూడుసార్లు ఉచితంగా క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు
ఆ తరువాత ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ. 150 ఛార్జ్
కాంప్లిమెంటరీ విత్‌డ్రాల్స్ నెలకు మూడే
థర్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్ పై రూ. 25,000 వరకు పరిమితి అమలులోకి వచ్చింది
ఈ మార్పులు ప్రధానంగా కొత్త ఖాతాదారులపై వర్తించనున్నాయి. ఖాతా ప్రారంభించేటప్పుడు కస్టమర్లు వాటిని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
