Tsrtc Iti” నిరుద్యోగ యువతకు మంచి వార్త: టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల

Tsrtc Iti”  హైదరాబాద్, ఆగస్టు 9:
తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్టీసీ) 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని హకీంపేటలో ఉన్న ఐటీఐ కళాశాలలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ:
విద్యార్థులు ఆగస్టు 28వ తేదీ లోగా టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాలు అక్కడే అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు మరియు కోర్సులు:

  • మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ వంటి ట్రేడుల్లో కోర్సులు అందిస్తున్నారు.

  • వెల్డర్, పెయింటర్ కోర్సులకు కనీసం 8వ తరగతి అర్హత అవసరం.

  • మిగతా కోర్సులకు 10వ తరగతి విద్యార్హత అవసరం.

  • వెల్డర్, డీజిల్ మెకానిక్ కోర్సుల వ్యవధి 1 సంవత్సరం కాగా,
    మోటార్ వెహికల్ మెకానిక్, పెయింటర్ కోర్సులు 2 సంవత్సరాలపాటు ఉంటాయి.

  • ప్రతి కోర్సుకు వార్షిక ఫీజు రూ. 16,500 గా నిర్ణయించారు.

అదనపు సమాచారం కోసం:
విద్యార్థులు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు:
9100664452
6302649844
040-69400000

ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్‌ పోస్టుల ఫలితాలు త్వరలో

ఇక, రాష్ట్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ మరియు స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల ఫలితాలు రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

  • ముందుగా 1284 ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు.

  • అనంతరం 2322 నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *